Chandrababu
Chandrababu యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు Chandrababu తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టని కూడా యనమల రామకృష్ణుడు చాటుకున్నారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల రామకృష్ణుడు శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు. 2020లో శాసనమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా చూసిన ఘనత కూడా యనమల రామకృష్ణుడుదే అంటారు.ఒక విధంగా చూస్తే టీడీపీలో ఆయన రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు.
అసలు ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దింపినప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉన్నారు. ఆ రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ఇంకా యనమల రామకృష్ణుడును భరిస్తూ వస్తున్నారని టీడీపీ వాళ్లు కూడా అంటూ ఉంటారు. అనేక కీలక పదవులు ఇచ్చి మర్యాదగానే చూశారు. యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబు Chandrababu కు ఎప్పటికప్పుడు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇలా బాబుకు పాతికేళ్ళుగా సాయం చేస్తూ వస్తున్న యనమల రామకృష్ణుడు రాజకీయంగా మాత్రం తన సొంత నియోజకవర్గం తునిలో ఏమాత్రం పట్టు సాధించలేకపోయారన్నది వాస్తవం. చివరిసారిగా యనమల రామకృష్ణుడు 2004 ఎన్నికల్లోనే తునిలో గెలిచారు. అంటే గత రెండు దశాబ్దాలుగా యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని తుని ప్రజలు వరసబెట్టి ఓడిస్తూనే ఉన్నారు.
Chandrababu shock to yanamala ramakrishnudu
ఒక సాధారణ న్యాయవాదిగా ఉన్న యనమల రామకృష్ణుడు 1983లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆనాటికి బలమైన తుని రాజుల మీద ఘన విజయం సాధించారు. అనంతరం యనమల రామకృష్ణుడు టీడీపీలో చేరిపోయి వరసగా గెలుస్తూ వచ్చారు. అయితే యనమల రామకృష్ణుడు తునిలో పార్టీ మీద దృష్టి పెట్టకపోవడం, తమ్ముడు కృష్ణుడి మీద పూర్తిగా బాధ్యతలు వదిలేయడంతో సైకిల్ జోరు బాగా తగ్గిపోయింది. ఇక యనమల రామకృష్ణుడుకు వారసులు ఎవరూ లేరు.
Chandrababu shock to yanamala ramakrishnudu
కుమార్తెలు రాజకీయాల్లోకి రారు. ఇక తునిలో తమ్ముడు కృష్ణుడిని కూడా జనాలు తిరస్కరించడంతో పెద్దాయన రాజకీయం పూర్తిగా చరమాంకానికి వచ్చేసినట్లే అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వమైతే 2025 వరకూ ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయనక్కరలేదు. ఆ తరువాత రాజకీయాల నుంచి పూర్తిగా రెస్ట్ తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా యనమల ఫ్యామిలీని పక్కన పెట్టి కొత్తవారిని ఇక్కడ టీడీపీ తయారు చేసుకోకపోతే మాత్రం ఈ సీటుని శాశ్వతంగా వదిలేసుకోవాల్సిందే అంటున్నారు.
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…
Jupiter Gochar : నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో దేవ గురువు అయిన బృహస్పతికి ఇంకా ప్రాముఖ్యత…
Janmastami 2025 : శ్రావణమాసం అంతటా కూడా పండుగల వాతావరణంతో నెలకొంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా శ్రావణమాసంలోనే వస్తుంది.…
Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్…
Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా…
This website uses cookies.