Chandrababu : ఆ సీనియర్ నేతకు చంద్రబాబు భారీ షాక్? రాజకీయ మేధావినే పక్కకు తప్పిస్తున్న చంద్రబాబు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chandrababu : ఆ సీనియర్ నేతకు చంద్రబాబు భారీ షాక్? రాజకీయ మేధావినే పక్కకు తప్పిస్తున్న చంద్రబాబు?

Chandrababu యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు Chandrababu తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టని కూడా యనమల రామకృష్ణుడు చాటుకున్నారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల రామకృష్ణుడు శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు. 2020లో శాస‌నమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా చూసిన ఘనత […]

 Authored By sukanya | The Telugu News | Updated on :2 August 2021,7:00 pm

Chandrababu యనమల రామకృష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు Chandrababu తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టని కూడా యనమల రామకృష్ణుడు చాటుకున్నారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల రామకృష్ణుడు శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు. 2020లో శాస‌నమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా చూసిన ఘనత కూడా యనమల రామకృష్ణుడుదే అంటారు.ఒక విధంగా చూస్తే టీడీపీలో ఆయన రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు.

అస‌లు ఎన్టీఆర్‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి గ‌ద్దె దింపిన‌ప్పుడు యనమల రామకృష్ణుడు స్పీక‌ర్‌గా ఉన్నారు. ఆ రుణం తీర్చుకునేందుకే చంద్ర‌బాబు ఇంకా యనమల రామకృష్ణుడును భ‌రిస్తూ వ‌స్తున్నార‌ని టీడీపీ వాళ్లు కూడా అంటూ ఉంటారు. అనేక కీలక పదవులు ఇచ్చి మర్యాదగానే చూశారు. యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబు Chandrababu కు ఎప్ప‌టిక‌ప్పుడు అనుకూలంగా వ్యవహరిస్తూ వ‌స్తున్నారు. ఇలా బాబుకు పాతికేళ్ళుగా సాయం చేస్తూ వస్తున్న యనమల రామకృష్ణుడు రాజకీయంగా మాత్రం తన సొంత నియోజకవర్గం తునిలో ఏమాత్రం పట్టు సాధించలేకపోయారన్నది వాస్తవం. చివరిసారిగా యనమల రామకృష్ణుడు 2004 ఎన్నికల్లోనే తునిలో గెలిచారు. అంటే గత రెండు దశాబ్దాలుగా యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని తుని ప్రజలు వరసబెట్టి ఓడిస్తూనే ఉన్నారు.

Chandrababu shock to yanamala ramakrishnudu

Chandrababu shock to yanamala ramakrishnudu

వరుస పరాజయాలతో..  Chandrababu

ఒక సాధారణ న్యాయవాదిగా ఉన్న యనమల రామకృష్ణుడు 1983లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆనాటికి బలమైన తుని రాజుల మీద ఘన విజయం సాధించారు. అనంతరం యనమల రామకృష్ణుడు టీడీపీలో చేరిపోయి వరసగా గెలుస్తూ వచ్చారు. అయితే యనమల రామకృష్ణుడు తునిలో పార్టీ మీద దృష్టి పెట్టకపోవడం, తమ్ముడు కృష్ణుడి మీద పూర్తిగా బాధ్యతలు వదిలేయడంతో సైకిల్ జోరు బాగా తగ్గిపోయింది. ఇక యనమల రామకృష్ణుడుకు వారసులు ఎవరూ లేరు.

Chandrababu shock to yanamala ramakrishnudu

Chandrababu shock to yanamala ramakrishnudu

కుమార్తెలు రాజకీయాల్లోకి రారు. ఇక తునిలో తమ్ముడు కృష్ణుడిని కూడా జనాలు తిరస్కరించడంతో పెద్దాయన రాజకీయం పూర్తిగా చరమాంకానికి వచ్చేసినట్లే అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వమైతే 2025 వరకూ ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయనక్కరలేదు. ఆ తరువాత రాజకీయాల నుంచి పూర్తిగా రెస్ట్ తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా యనమల ఫ్యామిలీని పక్కన పెట్టి కొత్తవారిని ఇక్కడ టీడీపీ తయారు చేసుకోకపోతే మాత్రం ఈ సీటుని శాశ్వతంగా వదిలేసుకోవాల్సిందే అంటున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది