Chandrababu : జగన్ కి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఇక మామూలుగా ఉండదు.. మోతమోతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : జగన్ కి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఇక మామూలుగా ఉండదు.. మోతమోతే..!

 Authored By kranthi | The Telugu News | Updated on :25 December 2022,7:20 pm

Chandrababu : మిగితా రంగాల్లో ఏమో కానీ.. రాజకీయ రంగంలో మాత్రం చాలా లొసుగులు ఉంటాయి. రాజకీయాల్లో చాలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉంటాయి. అటువంటి వ్యూహాలకు తట్టుకొని నిలబడితేనే రాజకీయాల్లో రాణిస్తారు. లేకపోతే రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. ఎందుకంటే.. రాజకీయాల్లో చాలామంది తమ ప్రత్యర్థ పార్టీలను ఆటాడుకుంటారు. వాళ్లను విమర్శిస్తుంటారు. వాళ్లు ఎక్కడైనా తప్పు చేసి దొరికితే చాలు.. అడ్డంగా పట్టేసుకుంటారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన పార్టీల పరిస్థితి అలాగే ఉంది. వైసీపీని టీడీపీ విమర్శించడం..

టీడీపీని వైసీపీ విమర్శించడం.. ఇదే పని. వైసీపీ నేతలు ఏదైనా తప్పుగా మాట్లాడినా.. సీఎం జగన్ ఏదైనా మిస్టేక్ గా మాట్లాడినా వెంటనే టీడీపీ ఐటీ వింగ్ పట్టుకొని దానిపై రచ్చ రచ్చ చేస్తుంది. చాలాసార్లు సీఎం జగన్ తప్పు దొర్లారు. దాన్ని పట్టుకొని నానా యాగీ చేసింది టీడీపీ వింగ్. ఇప్పుడు విజయనగరం పర్యటనలో భాగంగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వైసీపీ వాళ్లు దాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే.. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బొబ్బిలి సభకు వెళ్లి అక్కడ మాట్లాడుతూ..

chandrabu vijayanagaram district tour meeting

chandrabu vijayanagaram district tour meeting

Chandrababu : రెండు పిడికిళ్లు బిగించాలి.. పౌరుషం రావాలి.. సైకిల్ వద్దు అన్న చంద్రబాబు

రెండు చేతులు బిగించాలి… రెండు పిడికిళ్లు బిగించాలి.. పౌరుషం రావాలి.. సైకిల్ వద్దు.. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అందరూ ఆయన చెప్పినట్టుగానే సైకిల్ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత తను మాట్లాడిన తప్పును తెలుసుకున్న చంద్రబాబు.. ఏం మాట్లాడుకున్నా.. అక్కడ ఉన్న జనాలు మాత్రం అలాగే నినాదాలు చేయడంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని పట్టుకున్న వైసీపీ ఐటీ వింగ్.. రెచ్చిపోయింది. ఇది చంద్రబాబు మాట్లాడే తీరు. ఈయన మళ్లీ వైసీపీని విమర్శిస్తారు అంటూ ఐటీ వింగ్ సోషల్ మీడియాలో ఆ వీడియోపై ట్రోల్ చేస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది