Maoist Party Big Decision | నక్సలైట్ల శాంతి చర్చల పిలుపు ..కేంద్రానికి అభయ్ సంచలన లేఖ
Maoist Party Big Decision | దేశంలో నక్సలైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్” నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఆక్రమించుకుని పోరాటం కొనసాగిస్తున్న నక్సలైట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ఆయుధాలను వదిలి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు.

#image_title
గన్స్ వదిలేస్తాం..
ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నక్సల్స్ పార్టీ తరపున ఒక నెల కాలం కాల్పుల విరమణ ప్రకటిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల కోసం ముందుకు రావాలని కోరారు.
వీడియో కాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అభయ్ లేఖలో పేర్కొన్నారు. ఇ-మెయిల్ ఐడీను కూడా ప్రభుత్వం సంప్రదించేందుకు అందుబాటులో ఉంచారు. తమ నిర్ణయాన్ని టీవీ లేదా రేడియో ద్వారా అధికారికంగా ప్రకటించాలన్న అభ్యర్థనను కేంద్రానికి అందించారు. ఈ ప్రకటనలో, 2025 మార్చి నుంచి కేంద్రంతో చర్చలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని వారు పేర్కొన్నారు.దేశం, ప్రపంచం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు మున్ముందు శాంతి మార్గం ఎంచుకున్నామని అభయ్ వివరించారు. అయితే ఈ ప్రకటనపై భద్రతా దళాల నివేదిక తర్వాతే పూర్తి నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం వెల్లడించింది.