Petrol : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12 తక్కువే.. ఎక్కడంటే..?
Petrol : దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. రాజస్థాన్‌లో అయితే దేశంలో అత్యధిక ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కనుక అక్కడ పెట్రోల్ ధర రూ.100 తాకింది. ఇక అనేక రాష్ట్రాల్లోనూ ఇంచు మించుగా రూ.90 కి పైగానే పెట్రోల్ ధర ఉంది. దీంతోపాటు డీజిల్ ధరలు కూడా సామాన్యులకు కళ్ల వెంబడి నీళ్లు తెప్పిస్తున్నాయి.
అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చత్తీస్‌గడ్‌లో మాత్రం పెట్రోల్ ధర రూ.12 తక్కువగా ఉంది. అదే డీజిల్ అయితే రూ.4 తక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. ప్రజలకు పెరిగిన ఇంధన ధరలు భారం కాకూడదని చెప్పి ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బాగెల్ వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకనే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం తక్కువగా ఉన్నాయి.
చత్తీస్‌గడ్‌లో లీటర్ పెట్రోల్‌పై 25 శాతం పన్నుతోపాటు రూ.2 అదనంగా తీసుకుంటున్నారు. అలాగే డీజిల్‌పై 25 శాతం పన్నుతోపాటు రూ.1 అదనంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.87.28 ఉండగా, డీజిల్ ధర రూ.85.66గా ఉంది. యావరేజ్‌గా చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.96, డీజిల్ ధర రూ.86గా ఉంది.