Chicken 65 Recipe : చికెన్ సిక్స్టీ ఫైవ్ తో కర్రీ చేయండి ఇలా… దీని రుచిని మీరు జీవితంలో మర్చిపోలేరు…
Chicken 65 Recipe : చికెన్ 65 అంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు చికెన్ తో ఎన్నో రకాల ఐటమ్స్ చేసిన దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఈ చికెన్ 65 కర్రీని ఎక్కువగా అందరూ రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. ఇలాంటి చికెన్ 65 కర్రీ చేసుకోండి ఇలా తినండి మీ జీవితంలో మర్చిపోలేరు. ఈ రుచిని
దీనికి కావలసిన పదార్థాలు: 1)చికెన్ 2)పెరుగు3) కారం4) ఉప్పు 5)జీలకర్ర పొడి6) గరం మసాల 7)ధనియా పౌడర్ 8)పసుపు 9)ఫుడ్ కలర్ 10)కొత్తిమీర11) నీళ్లు 12)అల్లం వెల్లుల్లి పేస్ట్ 13)సోయాసాస్ 14)గ్రీన్ చిల్లిసాస్ 15)టమాటా కెచప్ 16)రెడ్ చిల్లి సాస్17) జీలకర్ర 18)పచ్చిమిర్చి19) వెల్లుల్లి 20)కరివేపాకు 21)ఉల్లిపాయలు 22)ఎండు మిరపకాయలు 23)నిమ్మకాయ 24) ఆయిల్ మొదలైనవి.
తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కేజీ చికెన్ తీసుకొని దానిలో అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి, చిటికెడు ఫుడ్ కలర్, ఒక గుడ్డుని బీట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు మైదాని వేసుకొని తర్వాత కొంచెం నీళ్లను వేసి తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న, ఈ చికెన్ ని ఒక్కొక్క ముక్క అంటుకోకుండా వేసి లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఈ ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, రెడ్ చిల్లి సాస్, సోయాసాస్, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర, అరకప్పు ఎల్లుల్లి సన్నగా తరిగినవి, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు అలాగే నాలుగు ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ విసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. తీసుకొని కొద్దిసేపు కుక్ అవ్వనిచ్చి దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను దీంట్లో వేయాలి. ఏసిన తర్వాత దీనిని ఒక 20 మినిట్స్ దగ్గరకయ్యలా ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆపి దింపేసి దానిలో కొంచెం కొత్తిమీర ఒక ఒక స్పూన్ నిమ్మరసం జ్యూస్ ను వేసి సర్వీసింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. అంతే ఎంతో రుచికరమైన చికెన్ 65 కర్రీ రెడీ.