Chinthamani Chicken Fry Recipe : హోటల్ స్టైల్ లో చింతామణి చికెన్ ఫ్రై.. ఎంతో సింపుల్ గా..

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 8:00 am

Chinthamani Chicken Fry Recipe : చికెన్ ని ఎన్నో రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క వెరైటీ కి ఒక్కో రుచి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక కొత్త వెరైటీ చింతామణి చికెన్ ఫ్రై తో మీ ముందుకు వచ్చాం. పేరు వెరైటీగా ఉన్న రుచి కూడా అంతే వెరైటీగా, అద్భుతంగాఉంటుంది. ఈ చింతామణి చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు : చికెన్, సాంబారు ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు, నువ్వుల నూనె, మెంతులు, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర మొదలైనవి. తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక మట్టి పాత్ర పెట్టుకొని దానిలో ఒక చిన్న కప్పు నువ్వుల నూనె వేసి రెండు స్పూన్ల ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత సాంబారు ఉల్లిపాయలు వాటిని కట్ చేయకుండా డైరెక్ట్ గా ఉల్లిపాయలను వేయాలి. అలా వేసి పది నిమిషాలు మూత పెట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో ఒక పది ఎండు మిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి.

Chicken Chintamani curry Recipe in hotel style is very simple

Chicken Chintamani curry Recipe in hotel style is very simple

తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకుని దీనిలో వేయాలి. వేసి మూత పెట్టి ఆయిల్ బయటికి వచ్చేవరకు మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత రెండు స్పూన్ల ఉప్పును వేసి, ఒక కప్పు నీటిని వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత దింపుకునే ముందు కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా చింతామణి చికెన్ ఫ్రై రెడీ. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీనిని ఎక్కువగా తమిళనాడు రెస్టారెంట్లో చేస్తూ ఉంటారు.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp