Chicken Pickle Recipe : చికెన్ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి… ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Pickle Recipe : చికెన్ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి చూడండి… ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది…

 Authored By prabhas | The Telugu News | Updated on :15 September 2022,6:30 am

Chicken Pickle Recipe : చికెన్ ఈ పేరు చెప్తేనే చిన్నపిల్లలు దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. అంతలా ఇష్టపడి తింటూ ఉంటారు చికెన్ ని. అటువంటి చికెన్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి చికెన్ మూడు నెలల పాటు నిల్వ ఉండేటట్లుగా మనం ఇప్పుడు చికెన్ పచ్చడి తయారు చేద్దాం.. ఈ చికెన్ పచ్చడి కి కావాల్సిన పదార్థాలు: బోన్ లెస్ చికెన్, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ధనియాలు, ఆవాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాతి పువ్వు, జీలకర్ర, లవంగాలు, నిమ్మరసం, ఆయిల్, కరివేపాకు, పుదీనా,వెల్లుల్లి రెబ్బలు మొదలైనవి..

ఇక దీని తయారీ విధానం : ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ధనియాలు, గసగసాలు, జీలకర్ర,మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, రాతి పువ్వు వేసి వేసి వేయించి అవి చల్లారాక మెత్తని పౌడర్లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని 15 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి ఉడికించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక తర్వాత వేరుశనగ నూనె వాడుతూ డీప్ ఫ్రై చేయాలి. అలా చేసిన తర్వాత ఆ చికెన్ అంతా తీసి పక్కన ఉంచుకొని అదే ఆయిల్లో ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి.

Chicken Pickle Recipe video on youtube

Chicken Pickle Recipe video on youtube

తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి వేయించుకోవాలి. ఇక తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా, ఒక అరకప్పు ఉప్పు, అరకప్పు ఒక కప్పు కారం, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉండనిచ్చి దానిని తీసి ఒక గాజు బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానిని బాగా చల్లారనిచ్చి దానిలో ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు నిమ్మరసం వేసి కలిపి మూడు రోజులు నిల్వంచాలి. అంతే ఎంతో సింపుల్ గా చికెన్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇక దాన్ని అస్సలు వదలరు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది