Chicken Pickle Recipe : చికెన్ పికిల్ పక్క కొలతలతో ఇలా చేసుకోండి… ఎవరికైనా నచ్చితిరాల్సిందే..!!
Chicken Pickle Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ రెండు నెలలపాటు నిల్వ ఉండాలి అంటే పక్క కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి.. ఇక ఇంట్లో వాళ్ళు మళ్లీమళ్లీ చేయమని చెప్తారు. ఈ చికెన్ పికిల్ అంత టేస్టీగా వస్తుంది… ఇక ఈ చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : చికెన్, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, నిమ్మకాయ ఆయిల్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుని మీడియం సైజు ముక్కల్ని కొట్టించుకొని వాటిని ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ చికెన్ ని
ఒక కళాయిలో వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ పికిల్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం.. ఈ మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు, నాలుగైదు యాలకులు, లవంగాలు, జిలకర, సోంపు మిరియాలు, నల్లయాలకులు ఏసి కొంచెం ఆవాలు కూడా కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించి తీసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఒక ఆఫ్ లీటర్ సెనగ నూనె పోసి అది వేడైన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ దాన్లో వేసి బాగా వేయించుకోవాలి.
చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్లో ఒక పావు కప్ ఉప్పు ఒక ఆర కప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా మిశ్రమం కూడా వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించి స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత ఒక నాలుగు నిమ్మకాయలు రసాన్ని దాంట్లో పిండుకోవాలి. అంతే చికెన్ ఫ్రై రెడీ అయినట్లే… ఈ చికెన్ పికిల్ ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది. దీనిని నిలవచేసిన రెండు మూడు రోజుల వరకు తినకూడదు. ఈ పికిల్ రెండు మూడు రోజుల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.