Chintakayala Vijay : పారిపోవడమే పనిగా పెట్టుకున్న చింతకాయల విజయ్
Chintakayala Vijay : చింతకాయల విజయ్ అనుకున్నాం కానీ.. ఆయన తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా అలాగే ఉన్నాడు. వీళ్లిద్దరూ తోడు దొంగలులా ఉన్నారు. వీళ్ల వ్యవహారమే భలే విచిత్రంగా ఉంది. ప్రత్యర్థ పార్టీలపై, ప్రత్యర్థ పార్టీ నేతలపై నోటికొచ్చింది మాట్లాడటంలో వీళ్ల స్టయిలే వేరు. ఏమాత్రం ఆలోచించరు.. ముందూ వెనుక అస్సలు చూసుకోరు. బూతులు తిట్టిన తర్వాతనే ఇంకేదైనా. అయ్యన్నపాత్రుడు అయితే అందులో దిట్ట.
తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తున్నాడు. తండ్రిలాగానే కొడుకు కూడా బూతులు తిడుతున్నాడు. అదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులపై చాలా అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడు.. పెట్టిస్తున్నాడు విజయ్. సోషల్ మీడియాలో నేతల ఫ్యామిలీలపై అటాక్ చేయడం కామన్. వీళ్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేద్దామనుకునేలోపు ఇద్దరూ తప్పించుకొని పారిపోతారు. ఒకసారి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని, ఇంటి ప్రహరీగోడను కూడా నిర్మించారని పోలీసులు వెళ్తే వాళ్లను బూతులు తిట్టాడు అయ్యన్నపాత్రుడు.
Chintakayala Vijay : పోలీసులపై బూతులు ప్రయోగించిన అయ్యన్నపాత్రుడు
ఆ వివాదంపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లగానే తప్పించుకొని పారిపోయారు. తాజాగా సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై టీడీపీ ఐటీ సెల్ ఐటీడీపీలో అసభ్యంగా పోస్టులు పెట్టడానికి కారణం విజయ్ అని తెలిసి పోలీసులు కేస్ బుక్ చేశారు. అప్పటికే విజయ్ పై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విజయ్ పలు చోట్లకు తిరుగుతున్నాడు. చివరకు హైదరాబాద్ లోనూ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు విజయ్. అసలు ఈ ఇద్దరు తండ్రీకొడుకులు ఎక్కడ తలదాచుకుంటారో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు పోలీసులకు చిక్కుతారో ఏమో?