Chiranjeevi : అప్పట్లో చిరంజీవి చేసిన పనికి చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 7, 2021, 8:15 am

పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు పైకి ఎదిగారు చిరంజీవి. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబు వంటి గొప్ప గొప్ప నటులు చిత్ర పరిశ్రమను ఏలుతున్న కాలంలో సినిమాల్లోకి అడుగు పెట్టిన చిరంజీవి తనకుంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని మెగాస్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిరంజీవికి ఇన్ని హిట్లు సాధించి పెట్టిన చిత్రాల్లో రాధిక‌, సుమ‌ల‌త‌, విజ‌య‌శాంతి, సుహాసిని, భానుప్రియ వంటి వారు నటించినవే అధికంగా ఉండటం విశేషం. అయితే వాటిల్లోనూ చిరంజీవి  రాధిక క‌లిసి నటించిన సినిమాలే అధికం. వీర‌ద్ద‌రి సినిమాల‌కు అప్ప‌ట్లో తెలుగునాట ఎంత క్రేజ్ అయితే ఉండేదో.. రాధిక‌తో చిరంజీవికి కూడా అంతే ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉండేది. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతుండటం విశేషం.

అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతుండటం విశేషం. అయితే ఓ సినిమా షూటింగ్ లో భాగంగా రాధిక మన మెగాస్టార్ చెంపపై గట్టిగా కొట్టిందట.చిరంజీవి రాధిక ల కాంబినేష‌న్లో వ‌చ్చిన తొలి సినిమా ప్రియ‌ అయినప్పటికీ… ముందుగా విడుద‌ల అయ్యింది మాత్రం న్యాయం కావాలి. ఈ సినిమాలో చిరంజీవిది నెగిటివ్ రోల్‌. ఈ చిత్రంలో చిరంజీవి రాధిక‌ను ప్రేమించి శారీర‌కంగా లోబ‌ర‌చుకుని.. త‌ర్వాత మోసం చేస్తాడు. అప్పుడు రాధిక చిరును నిలదీస్తూ.. నన్ను ఎందుకు మోసం చేశావంటూ గట్టిగా చెంప మీద కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ కోసం రాధిక ప‌దే ప‌దే టేకులు తీసుకుంద‌ట‌.

Chiranjeevi in a movie shooting news going viral in social media

Chiranjeevi in a movie shooting news going viral in social media

Chiranjeevi : చిరంజీవి చెంప చెల్లుమనిపించిన రాధిక..!

చిత్రీకరణ ఆలస్యం అవుతుండటంతో స్వయంగా చిరంజీవే తనను గ‌ట్టిగా కొట్ట‌మ‌ని చెప్ప‌డంతో రాధిక క్యారెక్ట‌ర్లో లీన‌మై చిరు చెంప‌ను ఒక్క‌సారిగా చెల్లుమ‌నిపించింద‌ట‌. ఆ దెబ్బతో పాపం మన మెగాస్టార్ చెంప ఎర్ర‌గా వాచిపోయింద‌ట‌. అది చూసి బాధపడ్డ రాధికతో.. షూట్ లో ఇలాంటిన్నీ సాధారణమే అంటూ అవేమి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. అనంతరం చిత్ర దర్శకుడు కోదండ రామిరెడ్డితో ఇలాంటి షాట్ మ‌రొక‌టి ఉందా అండి…? అని అడగగానే అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వేశార‌ట‌. 1981లో విడదలైన ఈ సినిమా నిర్మాత క్రాంతికుమార్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Breaking News 2

No bio available for this author.

  1. "Rapido Driver : నువ్వు సూప‌ర్ గురూ.. ర్యాపిడో పార్సిల్‌లో బంగారం పంపితే.. నగలతో డ్రైవర్ జంప్‌..!"

  2. "Adarsha Kutumbam : వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’కు కాపీరైట్ చిక్కులు.. అసలేం జరిగింది..?"

  3. "Breakup : మూడేళ్ల ప్రేమకు ముగింపు.. స్టార్ హీరో కొడుకుతో ఆ హీరోయిన్ కూతురు లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్..!"

  4. "Vijayawada Mayor Election : విజయవాడ మేయర్ పోరు రసవత్తరం.. కూటమి, వైసీపీకి ఏబీవీ సవాల్!"

  5. "10th New Rules : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!"

  6. "YS Sharmila : యలహంక ఇల్లు నాదే.. జగన్‌కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్.. ఆస్తుల వివాదంపై కీలక ట్వీట్!"

  7. "Cheyutha Pension : తెలంగాణ చేయూత పింఛన్లపై గుడ్‌న్యూస్.. వారికి వెంటనే పెన్షన్ !"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp