YCP MLA : బ్రేకింగ్ న్యూస్.. వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా.. షాకింగ్ లో జగన్.. అసలేం జరుగుతోంది?
YCP MLA : ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఈయన వైసీపీ ఎమ్మెల్యే. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేఖను జేఏసీకి అందజేశారు.
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైన విషయం తెలిసిందే.ఈనెల 15 వ తేదీన వైజాగ్ లో రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఈసందర్భంగా కరణం ధర్మశ్రీ చెప్పుకొచ్చారు. అయితే.. రాజధాని వికేంద్రీకరణ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

chodavaram mla karanam dharmasri resigned to his mla post
YCP MLA : దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామ చేయాలి
వికేంద్రీకరణకు మద్దతుగా అచ్చెన్నాయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని, తిరిగి పోటీ చేయాలని ఈసందర్భంగా తన రాజీనామా లేఖను సమర్పించాక కరణం ధర్మశ్రీ అన్నారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆయన రాజీనామా చేస్తే తనపై పోటీ చేయడానికి తాను సిద్ధం అని కరణం ధర్మశ్రీ తెలిపారు.