YCP MLA : వైసీపీ ఎమ్మెల్యేని దక్కించుకోవాలి అని చూస్తోంది ఎవరు?
YCP MLA : సీబీఐ, ఈడీ, ఐటీ అధికారుల దాడులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా ఈ దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇటీవలే ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ఏఫీలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాకి చెందిన ఫ్యామిలీ మెంబర్స్,
బంధువుల ఇంటిపై వరుసగా దాడులు జరిగాయి.ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో, ఆయన ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. నిజానికి.. ముస్తఫా సోదరుడు కనుమ.. అంజుమన్ కమిటీ అధ్యక్షుడు. ముస్తఫాకి చెందిన కొన్ని లావాదేవీల్లోనూ కనుమ పర్యవేక్షిస్తుంటారట. అందుకే.. ఐటీ అధికారులు ముస్తఫా సోదరుడి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముస్తఫాకు పొగాకు వ్యాపారం ఉంది. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి వాళ్లు పొగాకు వ్యాపారంలో ఉన్నారు.
YCP MLA : పొగాకు వ్యాపారంలో ముస్తఫా
రెండు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు అందుకే ముస్తఫా వ్యాపారం లావాదేవీలను చెక్ చేశారు. ముస్తఫా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అందుకే.. ఇప్పుడు ఐటీ అధికారులు ఇద్దరినీ ఫోకస్ చేశారు. ముస్తఫా రెండు సార్లు వైసీపీ నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ సారి ఆయన పోటీ చేస్తారా లేదా అనేది తెలియదు కానీ.. ఆయన కూతురుకి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐటీ దాడులతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.