Clove | రాత్రిపూట దగ్గుతో ఇబ్బందిపడుతున్నారా?.. మీ వంటగదిలోనే ఉంది సింపుల్ రిమెడీ !
Clove | వాతావరణంలో తరచూ జరుగుతున్న మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ ఆరోగ్య సమస్యలు సాధారణమయ్యాయి. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే దగ్గు నిద్రను భంగం చేస్తూ ఇబ్బందులు కలిగిస్తుంది. కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ సమస్యకు పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. అదే లవంగం (Clove).
#image_title
ఉపయోగాలు ఇవే..
ఆయుర్వేదం ప్రకారం లవంగం దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగించే సహజ ఔషధంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట దగ్గు మొదలైతే, ముందుగా ఒక గుక్క నీరు తాగి, ఆ తర్వాత నోట్లో ఒక లవంగ మొగ్గ ఉంచుకోవాలి. దానిని తేలికగా దంతాల మధ్య నొక్కడం వల్ల దాని రసం నెమ్మదిగా గొంతులోకి చేరుతుంది. ఇది దగ్గును తగ్గించడమే కాకుండా, గొంతులో మంటను కూడా తగ్గిస్తుంది.
తద్వారా దగ్గు ఆగి నిద్ర సులభంగా పడుతుంది. ఉదయం లేవగానే లవంగాన్ని ఉమ్మివేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతిని చిన్న పిల్లలకు మాత్రం వాడకూడదు, ఎందుకంటే లవంగం గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. లవంగాలలో ఉండే యూజినాల్ (Eugenol) అనే సహజ రసాయనం యాంటీ బాక్టీరియల్ గుణాలతో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది గొంతులో వాపు, మంట తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగం నమలడం వల్ల రసం నేరుగా గొంతులోకి వెళ్లి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.