Lose Weight : వేగంగా బరువు తగ్గాలంటే ఈ టీని తాగాల్సిందే.. ఒక్కసారి తాగారంటే జన్మలో వదలరు..!
Lose Weight : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్నది ఊబకాయం. దాన్నే ఒబెసిటీ అంటాం. ఒబెసిటీ వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక బరువు ఉంటే.. ఏ పనీ చేయలేం. లేనిపోని వ్యాధులు వస్తుంటాయి. కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే.. చాలామంది బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. బరువు తగ్గేందుకు ఎన్ని కష్టాలు పడినా.. కొందరైతే అస్సలు లావు తగ్గరు. వ్యాయామాలు, కసరత్తులు, జిమ్.. ఇలా ఎంత కష్టపడ్డా.. ఫలితం మాత్రం ఉండదు. అటువంటి వాళ్లు ఏం చేయాల్సిన పనిలేదు. టెన్షన్ పడాల్సిన పని అస్సలు లేదు. కేవలం.. ఒక్క పని చేస్తే చాలు. మీరు వద్దన్నా.. వేగంగా త్వరగా బరువు తగ్గేస్తారు.

clove tea good for health and to lose weight
భారతదేశం అంటేనే ఆయుర్వేదానికి పుట్టినిల్లు. ఆయుర్వేదానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తామో అందరికీ తెలుసు. మన ఆయుర్వేద విధానాలను తీసుకెళ్లి.. వేరే దేశాల్లో ఆచరిస్తుంటారు. ఆయుర్వేదం పుట్టిందే భారతదేశంలో. ఆయుర్వేదం వల్ల.. ఎటువంటి వ్యాధి అయినా నయం అవుతుందని చాలా సార్లు ప్రూవ్ కూడా అయింది. అలాగే వేగంగా బరువు తగ్గాలంటే.. మీరు చేయాల్సింది ఒక్కటే. ఒక అమేజింగ్ చాయ్ ని తాగాల్సి ఉంటుంది.
Lose Weight : లవంగా చాయ్ తాగండి.. వేగంగా బరువు తగ్గండి
లవంగం అనేది ఒక సుగంధ ద్రవ్యం. దీన్ని మనం మసాలాగా చేసుకొని ప్రతి కూరలో వాడుకుంటాం. లవంగా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే.. శరీరంలో ఉన్న అనవసర కొవ్వును కరిగించడానికి లవంగా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ బాక్టీరియా గుణాలతో పాటు.. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే.. శరీర బరువును తగ్గిస్తుంది.

clove tea good for health and to lose weight
లవంగాలతో చేసిన చాయ్ ని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే.. పొట్ట పోతుందట. శరీరంలోని అనవసర కొవ్వు అంతా కరిగి.. మనిషి చాలా ఫిట్ గా మారుతాడట. మన పూర్వీకులు ఎక్కువగా లవంగాలతో చేసిన టీనే తాగేవారట. అందుకే వాళ్లు ఏమాత్రం పొట్ట లేకుండా.. చాలా ఫిట్ గా ఉండేవారు.
Lose Weight : లవంగాల టీని ఎలా తయారు చేయాలంటే?

clove tea good for health and to lose weight
లవంగాల టీని తయారు చేయడం చాలా సులభం. కొన్ని లవంగాలను తీసుకొని, ఒక గిన్నెలో నీళ్లు పోసి ముందు మరిగించి.. ఆ తర్వాత కాసిన్ని లవంగాలు, దంచిన అల్లం వేసి ఇంకాస్త మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టండి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి.. కాసింత నిమ్మరసం కలిపి తాగేయండి. దీన్ని పూర్తిగా చల్లారేదాక ఉంచొద్దు. కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి.
ఇది కూడా చదవండి ==> నిద్ర పోయే ముందు రెండు లవంగాలను నమిలి మింగి గోరువెచ్చని నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!
ఇది కూడా చదవండి ==> ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ లలో ఏది డేంజర్?.. ఎలా గుర్తించాలి?..
ఇది కూడా చదవండి ==> మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. మీ కిడ్నీలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..!