Kidney Health : మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. మీ కిడ్నీలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..!
Kidney Health : కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీరంలోని రక్తాన్ని వడబోసే పని కిడ్నీలదే. అలాగే.. శరీరంలోని విష పదార్థాలను అన్నింటినీ వడబోసి.. మూత్రం ద్వారా బయటికి పంపించే పని కూడా కిడ్నీలదే. మొత్తానికి శరీరంలో కిడ్నీలు లేకపోతే మనిషి బతకలేడు. శరీరం మొత్తం విషంతో నిండిపోతుంది. అందుకే.. కిడ్నీలను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. మూత్రపిండాలు బాగుంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే.. రోజు రోజు మనం తిన్న ఆహారం.. ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ఒక్క రోజు మూత్రం రాకున్నా కూడా సమస్యలే. ఒక వేళ కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే.. అది సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే లేనిపోని సమస్యలు రావడం ఖాయం.
అందుకే.. ఒక్కసారి కిడ్నీ సమస్యలు వచ్చాయంటే… చాలా అనారోగ్యం వస్తుంది. అయితే.. చాలామందికి తమ కిడ్నీలు బాగానే పని చేస్తున్నాయి అని అనుకుంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది కిడ్నీ సమస్య కాదనుకుంటారు. దాని వల్ల.. కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కిడ్నీల్లో ఏదైనా సమస్య వస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించి మెడిసిన్ తీసుకొని ఆసమస్యను నయం చేసుకోవాలి. అది ఎంత తొందరగా చేసుకుంటే అంత మేలు. లేదంటే మొదటికే మోసం వస్తుంది.
Kidney Health : కిడ్నీలు దెబ్బతిన్నాయని ఎలా తెలుసుకోవాలి?
ఊరికే అలసిపోతున్నారా? అయితే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్టే. అలసిపోవడం, నీరసంగా ఉండటం, శక్తి ఉండకపోవడం.. ఇలా నిత్యం అనిపిస్తే మాత్రం కిడ్నీ సమస్యలు వచ్చినట్టే. మూత్రపిండాల పనితీరు మందగిస్తేనే నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. వాటి పని అవి చేయకపోతే.. రక్తంలో విష పదార్థాలు అలాగే ఉండిపోతాయి. దాని వల్ల.. మనిషి యాక్టివ్ గా ఉండడు. అలసటగా ఉంటాడు. బలహీనం అవుతారు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లకు రక్త హీనత కూడా ఉంటుంది. రక్తంలో విషపదార్థాలు పెరిగిపోవడం వల్ల.. రక్త హీనత సమస్య ఏర్పడుతుంది.
కొందరికి నిద్ర మధ్యలో అవాంతరాలు వస్తుంటాయి. అలా వచ్చినా కూడా మూత్రపిండాల సమస్య ఉన్నట్టే. మూత్రాన్ని కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయకపోయినా ఇటువంటి సమస్య వస్తుంది. దీన్నే స్లీప్ అప్నియా అంటారు. మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే.. విషపదార్థాలు రక్తంలోనే నిలిచిపోతాయి. దాని వల్ల.. మూత్రపిండాల్లో సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి.
అతిగా మూత్రం వచ్చినా.. మూత్రం బాగా నురుగుగా వచ్చినా.. మూత్రంలో బుడగలుగా వచ్చినా.. కాళ్లలో వాపు వచ్చినా.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్టే లెక్క. ఆకలి తక్కువగా ఉన్నా కూడా మూత్రపిండాలు దెబ్బతిన్నాయని అనుకోవాలి. పైన చెప్పుకున్న లక్షణాలు మీలో ఉంటే.. మీ మూత్రపిండాలు దెబ్బతిన్నట్టే. వెంటనే డాక్టర్ ను సంప్రదించి సరైన మెడిసిన్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలు. లేదంటే.. భవిష్యత్తులో కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> నిద్ర పోయే ముందు రెండు లవంగాలను నమిలి మింగి గోరువెచ్చని నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!
ఇది కూడా చదవండి ==> వేగంగా బరువు తగ్గాలంటే ఈ టీని తాగాల్సిందే.. ఒక్కసారి తాగారంటే జన్మలో వదలరు..!
ఇది కూడా చదవండి ==> ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ లలో ఏది డేంజర్?.. ఎలా గుర్తించాలి?..