CM Jagan : సీఎం జగన్ బీసీల‌కు ఇచ్చిన‌ ప్రతి హామీ మాటను నెరవేర్చారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM Jagan : సీఎం జగన్ బీసీల‌కు ఇచ్చిన‌ ప్రతి హామీ మాటను నెరవేర్చారు

CM Jagan : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం బీసీలకు డీబీటీ ద్వారా మూడున్నరేళ్ళలో రూ. 86 వేల కోట్లు చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ బీసీలలో ‘క్విట్ బాబూ’ నినాదం మారుమోగుతోంది: బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల బీసీ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 November 2022,10:10 pm

CM Jagan : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం బీసీలకు డీబీటీ ద్వారా మూడున్నరేళ్ళలో రూ. 86 వేల కోట్లు చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ బీసీలలో ‘క్విట్ బాబూ’ నినాదం మారుమోగుతోంది: బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల బీసీ ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో జరిగిన బీసీ ముఖ్యనేతల భేటీ లో బీసీ మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబరు 8వ తేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ ని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

సీఎం జగన్ మూడున్నరేళ్ళ పరిపాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి, ఒక పండుగ వాతావరణంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని పదవుల్లో బీసీలేకే ప్రాధాన్యం : మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ 56 కార్పొరేషన్లు, 672 మంది డైరెక్టర్లు, 122 ప్రభుత్వ కార్పొరేషన్లలో బీసీ కులాలకు సంబంధించిన వారిని నియమించడం జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్ళు పూర్తవుతుందని, ఈ నేపథ్యంలోనే బీసీల ఆత్మీయ కలయిక సమ్మేళనం నిర్వహించాలని అనుకున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

CM Jagan has fulfilled every word said in the BC declaration

CM Jagan has fulfilled every word said in the BC declaration

చంద్రబాబు హయాంలో కుల వృత్తులు చేసుకునే వారికి పనికిరాని పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీసీల అవసరాలను గుర్తించి…వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని వివరించారు. దేశంలో బీసీలకు పెద్ద పీట వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, మేలు చేసింది జగనన్న కాబట్టి.. బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటే.. బీసీల రాష్ట్రంగా నిలిచింది మాత్రం ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెబుతున్నారని, ఇది చారిత్రాత్మక సంస్కరణలు అని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు జగన్: బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గత ఎన్నికలకు ముందే, తన సుదీర్ఘ పాదయాత్రలో బీసీల స్థితిగతులను గుర్తించి,

వారి జీవన ప్రమాణాలపై ఒక కమిటీ వేసి అధ్యయనం చేయించిన నాయకుడు జగన్ అని అన్నారు.  ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని తెలిపారు. డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలతో పాటు, చెప్పని కొత్త అంశాలను కూడా చేర్చి, సీఎం జగన్ అమలు చేస్తున్నారాని అన్నారు. బీసీల సంక్షేమ సారధి జగన్: ఎంపీ మార్గాని భరత్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎవర్నీ కలవడం అవసరం లేకుండా బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా.. ఒక్క బటన్ తో రూ. 86 వేల కోట్లు మూడున్నరేళ్ళలో ఇచ్చారని అన్నారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరాని ఎంపీ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరైయ్యారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది