Ys Jagan : ఈ మూడు హామీలు ఇస్తే నెక్స్ట్ సీఎం నువ్వే జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : ఈ మూడు హామీలు ఇస్తే నెక్స్ట్ సీఎం నువ్వే జగన్..!

Ys Jagan : ఎన్నికలలో గెలవాలని ఏ రాజకీయ నాయకుడుకి ఉండదు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని కేఏ పాల్ తో సహా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నుంచి కేఏ పాల్ వరకు ప్రతి రాజకీయ నాయకుడు టార్గెట్ అదే. కానీ అధికారంలో ఉండే రాజకీయ నాయకుడి ఆలోచన కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మూడు పెద్ద పథకాలను ఇవ్వగలిగే పొజిషన్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 January 2024,2:15 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : ఈ మూడు హామీలు ఇస్తే నెక్స్ట్ సీఎం నువ్వే జగన్..!

Ys Jagan : ఎన్నికలలో గెలవాలని ఏ రాజకీయ నాయకుడుకి ఉండదు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని కేఏ పాల్ తో సహా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నుంచి కేఏ పాల్ వరకు ప్రతి రాజకీయ నాయకుడు టార్గెట్ అదే. కానీ అధికారంలో ఉండే రాజకీయ నాయకుడి ఆలోచన కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మూడు పెద్ద పథకాలను ఇవ్వగలిగే పొజిషన్ లో ఆయననే పెడుతుంది. అది కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి అదే మూడు పెద్ద పథకాలు ఆయన నీ కుర్చీ ఎక్కనిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన హామీ ఇవ్వగలరు కానీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే వెంటనే వాటిని అమలు చేయగలరు. హామీ ఇచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే వాటిని అమలు చేయగలిగితే మళ్లీ ఆయన సీఎం అవ్వడం కన్ఫామ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక దీనిలో మొట్ట మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో మరియు కర్ణాటక ప్రాంతంలో ఈ పథకం సక్సెస్ అయింది.

అంతేకాక కర్ణాటకలో ఈ పథకం గురించి చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే తెలంగాణ లో కూడా అదే జరిగింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం ఒక్క మహిళలకు మాత్రమే పెట్టడం వలన చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. దానికి బదులు వారికి ఒక పాస్ లేదా మరి ఏదైనా ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలాంటిది ఆయన నిజంగానే ఇవ్వగలిగితే ఏపీ సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండవది వచ్చేసి రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ చేయకపోవడం వలన తెలంగాణలో సీఎం కేసీఆర్ ఓడిపోవడం జరిగిందని చాలామంది భావిస్తున్నారు. రైతులకు రైతుబంధులు ఇవ్వడం ముఖ్యమైన కాకపోయినా తమకి ఉన్న అప్పు మొత్తాన్ని మాఫీ చేసే అంశాన్ని కేసీఆర్ సర్కార్ సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు మరల వారే అధికారంలో ఉండేవారు. గత రెండు మూడు సంవత్సరాల కిందట నుంచి కూడా రైతులు తమకి రైతుబంధు కంటే రైతు రుణమాఫీ చెయ్యమని కెసిఆర్ ని ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. కానీ కేసీఆర్ దానిని చేయలేకపోయారు.

అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ రుణమాఫీ చేస్తే రైతుల నుంచి తనకి చాలా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. అలాగే మూడవది ప్రభుత్వ ఉద్యోగుల విషయం. ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యంతర ఉద్యోగాలు ఇవ్వగలిగితే చాలామంది ఉద్యోగులు ఓట్లు సీఎం జగన్ కి పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. అయితే సీఎం జగన్ ముందుగానే ఈ ప్రకటన చేసి వాటిని అమలకు సిద్ధం చేస్తే తప్పకుండా మళ్లీ సీఎం అయిపోతాడు. ఇక ఈ మూడు పథకాలను అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కి వచ్చే ఎన్నికలలో ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి ద్వారా వైయస్ జగన్ మళ్లీ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఎవరు ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ అభ్యర్థులను మారుస్తూ వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తున్న జగన్ ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి మరి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది