తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ మారిపోయాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీని గెలిపించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు టర్న్ అవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోవడంతో.. టీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం కేసీఆర్ కు సహకరించడం లేదట. ముఖ్యంగా కొందరు మంత్రులు అయితే సీఎం కేసీఆర్ మాటను వినడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
ఓవైపు బీజేపీ… టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని తెలంగాణలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ లూప్ హోల్స్ ను వెతికి మరీ హైలెట్ చేస్తోంది. బీజేపీ ఇంతలా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా.. సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నా… ఒక్క టీఆర్ఎస్ నేత కూడా స్పందించడం లేదు. కొందరు మంత్రులైతే చుప్ చాప్ అయ్యారట.
ముగ్గురు మంత్రులైతే.. ఎప్పుడు చాన్స్ దొరికితే అప్పుడు బీజేపీలోకి జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట. వెంటనే సమాచారం హైకమాండ్ కు చేరడంతో.. వెంటనే కేసీఆర్ వాళ్లను ప్రగతి భవన్ కు పిలిచారట. వాళ్లకు క్లాస్ పీకారట.
బీజేపీని బరాబర్ విమర్శించాలని.. నేతలు ఏమాత్రం వెనకడుగు వేయొద్దని సీఎం కేసీఆర్.. నేతలకు సూచించారట. వాళ్లకు ఒక లాస్ట్ చాన్స్ ఇచ్చారని.. అయినప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే.. మంత్రి పదవి నుంచి వాళ్లను తప్పించడానికి కూడా కేసీఆర్ వెనుకాడటం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.