కేసీఆర్ కు పొగబెడుతున్న తెలంగాణ మంత్రులు.. సొంత పార్టీలోనే ఇబ్బందులు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కేసీఆర్ కు పొగబెడుతున్న తెలంగాణ మంత్రులు.. సొంత పార్టీలోనే ఇబ్బందులు?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ మారిపోయాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీని గెలిపించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు టర్న్ అవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోవడంతో.. టీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం కేసీఆర్ కు సహకరించడం లేదట. ముఖ్యంగా కొందరు మంత్రులు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 January 2021,7:23 pm

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ మారిపోయాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీని గెలిపించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు టర్న్ అవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాల్నో అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోవడంతో.. టీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం కేసీఆర్ కు సహకరించడం లేదట. ముఖ్యంగా కొందరు మంత్రులు అయితే సీఎం కేసీఆర్ మాటను వినడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

cm kcr getting disturbances from trs party leaders

cm kcr getting disturbances from trs party leaders

ఓవైపు బీజేపీ… టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని తెలంగాణలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ లూప్ హోల్స్ ను వెతికి మరీ హైలెట్ చేస్తోంది. బీజేపీ ఇంతలా టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా.. సీఎం కేసీఆర్ పై బురద జల్లుతున్నా… ఒక్క టీఆర్ఎస్ నేత కూడా స్పందించడం లేదు. కొందరు మంత్రులైతే చుప్ చాప్ అయ్యారట.

ముగ్గురు మంత్రులైతే.. ఎప్పుడు చాన్స్ దొరికితే అప్పుడు బీజేపీలోకి జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట. వెంటనే సమాచారం హైకమాండ్ కు చేరడంతో.. వెంటనే కేసీఆర్ వాళ్లను ప్రగతి భవన్ కు పిలిచారట. వాళ్లకు క్లాస్ పీకారట.

బీజేపీని బరాబర్ విమర్శించాలని.. నేతలు ఏమాత్రం వెనకడుగు వేయొద్దని సీఎం కేసీఆర్.. నేతలకు సూచించారట. వాళ్లకు ఒక లాస్ట్ చాన్స్ ఇచ్చారని.. అయినప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే.. మంత్రి పదవి నుంచి వాళ్లను తప్పించడానికి కూడా కేసీఆర్ వెనుకాడటం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది