KCR : మోడీ హైదరాబాద్ పర్యటన.. ప్లాన్‌ చేంజ్ చేసుకున్న కేసీఆర్‌

KCR : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ కు రాబోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం లో ఆయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో అడుగు పెట్టింది మొదలు తిరిగి ఢిల్లీ విమానం ఎక్కువ వరకు సీఎం కేసీఆర్ ఆయనతోనే ఉండబోతుందట్లుగా తెలుస్తోంది. మొదట సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను బహిష్కరించాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి. కేసీఆర్‌ కి బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని పర్యటనను పర్యవేక్షించడం తో పాటు ప్రధానికి స్వయంగా తలసాని స్వాగతం పలుకుతారు అంటూ ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా ప్రధానిని అవమానించారంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది బిజెపికి కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు నిర్ణయాన్ని మార్చుకున్నారు.

సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మోడీతో ఈ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ సందర్భంగా రాజకీయపరమైన చర్చలు ఏమి రాకుండా జాగ్రత్త పడతారా లేదంటే ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కు సంబంధించి ఎలాంటి ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా అంటూ చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ లు జర్నీ చేసే సమయంలో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి.. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మరియు ప్రధాని నరేంద్ర మోడీలు గతంలో పలు సందర్బాల్లో కలిశారు. ఆసమయంలో ప్రధాని మరియు సీఎంలు చాలా సరదాగా మాట్లాడుకున్న సందర్బాలు ఉన్నాయి.

cm kcr meet with pm narendra modi today program

KCR : యాదాద్రి కోసం సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేంజ్‌..

యాదాద్రి కి సంబంధించిన ప్రారంభోత్సవంకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని కేసీఆర్‌ భావిస్తున్నాడు. ఒక వేళ కేసీఆర్ ఇప్పుడు మోడీ పర్యటనను బహిష్కరిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం యాదాద్రి పై పడుతుంది. కేసీఆర్ ఆ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించినా వస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే నేడు ఆయన పర్యటనకు సహకరించి.. ఆయన వెంటే ఉండాలని కేసీఆర్ తన ప్లాన్‌ చేంజ్ చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు నాలుగు రోజుల ముందే ప్రధాని పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇలా ఆయనకు పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతారు అంటూ కాంగ్రెస్ నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నారు.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

10 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

11 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

11 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

13 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

14 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

15 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

16 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

16 hours ago