KCR : మోడీ హైదరాబాద్ పర్యటన.. ప్లాన్ చేంజ్ చేసుకున్న కేసీఆర్
KCR : భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ కు రాబోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం లో ఆయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో అడుగు పెట్టింది మొదలు తిరిగి ఢిల్లీ విమానం ఎక్కువ వరకు సీఎం కేసీఆర్ ఆయనతోనే ఉండబోతుందట్లుగా తెలుస్తోంది. మొదట సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను బహిష్కరించాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి. కేసీఆర్ కి బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని పర్యటనను పర్యవేక్షించడం తో పాటు ప్రధానికి స్వయంగా తలసాని స్వాగతం పలుకుతారు అంటూ ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా ప్రధానిని అవమానించారంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది బిజెపికి కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు నిర్ణయాన్ని మార్చుకున్నారు.
సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మోడీతో ఈ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ సందర్భంగా రాజకీయపరమైన చర్చలు ఏమి రాకుండా జాగ్రత్త పడతారా లేదంటే ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కు సంబంధించి ఎలాంటి ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా అంటూ చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ లు జర్నీ చేసే సమయంలో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి.. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ మరియు ప్రధాని నరేంద్ర మోడీలు గతంలో పలు సందర్బాల్లో కలిశారు. ఆసమయంలో ప్రధాని మరియు సీఎంలు చాలా సరదాగా మాట్లాడుకున్న సందర్బాలు ఉన్నాయి.

cm kcr meet with pm narendra modi today program
KCR : యాదాద్రి కోసం సీఎం కేసీఆర్ ప్లాన్ చేంజ్..
యాదాద్రి కి సంబంధించిన ప్రారంభోత్సవంకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నాడు. ఒక వేళ కేసీఆర్ ఇప్పుడు మోడీ పర్యటనను బహిష్కరిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం యాదాద్రి పై పడుతుంది. కేసీఆర్ ఆ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించినా వస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే నేడు ఆయన పర్యటనకు సహకరించి.. ఆయన వెంటే ఉండాలని కేసీఆర్ తన ప్లాన్ చేంజ్ చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు నాలుగు రోజుల ముందే ప్రధాని పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇలా ఆయనకు పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతారు అంటూ కాంగ్రెస్ నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నారు.