వచ్చే ఎన్నికల్లో వాళ్లకు నో టికెట్.. ఒక మంత్రి కూడా ఔట్.. ఖరాఖండిగా చెప్పేసిన కేసీఆర్

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 December 2020,12:47 pm

సీఎం కేసీఆర్.. రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ఎవరితో ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి.. అనే విషయం పక్కాగా తెలిసిన వ్యక్తి. అందుకే.. అప్రతిహాతంగా రెండో సారి కూడా గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల గడువు కంటే సంవత్సరం ముందే మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చి మరీ.. గెలిచి చూపించారు. కేసీఆర్ వేసే ఎత్తులు ఎవ్వరికీ అర్థం కావు. దేశంలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న అతితక్కువ నేతల్లో కేసీఆర్ ఒకరు. ఆయన రాజకీయ చతురత ముందు అందరూ దిగదుడుపే.

cm kcr serious on trs leaders

cm kcr serious on trs leaders

కానీ.. గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దానికి కారణం కూడా అందరికీ తెలుసు. వరుసగా ఓటములను చవిచూస్తోంది. దుబ్బాక ఉపఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ డీలా పడిపోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నారు సీఎం. అందుకే వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.

త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఈ రెండు ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండకూడదని.. పార్టీని బలోపేతం చేయాలని.. మళ్లీ తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కలిగేలా చేయాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారు.

అందుకే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను లైట్ తీసుకున్న నేతలపై దృష్టి కేంద్రీకరించారు కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో కొందరు నాయకులు ప్రచారం చేయలేదు. చాలామంది ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు. దాని వల్ల పార్టీకి నష్టం కలిగింది. అటువంటి నాయకులపై ప్రస్తుతం సీఎం సీరియస్ గా ఉన్నారట. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ గెలుపు కోసం పనిచేయలేదో.. వాళ్లను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట.

వచ్చే ఎన్నికల్లో ఆ నేతలకు.. వాళ్లు ఎవరైనా సరే.. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. వాళ్లకు టికెట్ ఇచ్చే సమస్యే లేదని బల్లగుద్ది మరీ కేసీఆర్ చెబుతున్నారట. ఆ నేతల్లో కొందరు ముఖ్య నేతలు కూడా ఉండటంతో.. ఇలా చేస్తే ఎలా.. అని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట.

అందులో ఒక మంత్రి కూడా ఉన్నారట. ఆ మంత్రిని త్వరలోనే పదవి నుంచి తప్పించేందుకు కేసీఆర్ సంసిద్ధం అవుతున్నారట. మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదట. భవిష్యత్తులో పార్టీకి మళ్లీ ఇటువంటి దుస్థితి రావద్దంటే.. ఇటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని కేసీఆర్ పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యే నేతలు ఎవరు.. అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి