CM KCR : సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. ఫామ్ హౌస్ లోనే క్వారంటైన్ లోకి
CM KCR : ప్రస్తుతం తెలంగాణలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల రేటు కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో వెంటనే ఆయనకు కరోనా టెస్ట్ చేయించారు. దీంతో ఆయన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
వెంటనే కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఆయన ప్రస్తుతం స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారు. అయినప్పటికీ… డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. సీఎం కేసీఆర్ కు కరోనా సోకిందని… ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
CM KCR : సాగర్ మీటింగ్ లోనే కేసీఆర్ కు కరోనా సోకి ఉండొచ్చు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ ఈనెల 14న హాలియాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడే కేసీఆర్ కు కరోనా సోకి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హాలియా సభలో పాల్గొన్న చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు కూడా అక్కడే కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ను ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.