CM Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి .. సీఎంగా మొదటి సంతకం దేనికి చేశారంటే..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి .. సీఎంగా మొదటి సంతకం దేనికి చేశారంటే..??

 Authored By anusha | The Telugu News | Updated on :7 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ..

  •  సీఎంగా మొదటి సంతకం దేనికి చేశారంటే..??

CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎం లు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపారు. కానీ వీళ్ళు ఎవరు ఈ కార్యక్రమానికి రాలేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే అధికారుల ప్రక్షాళన నడుం బిగించారు. అత్యంత కీలకమైన ఇంటిలిజెన్స్ చీప్ గా శివధర్ రెడ్డిని నియమించారు. సీఎంఓ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు.

అయితే దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తూ రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నాంపల్లికి చెందిన రజినీకి మొదటి ఉద్యోగం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్టోబర్ నెలలో 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో రజిని తనకు ఏ ఉద్యోగం రాలేదని తన ఆవేదనను చెప్పుకుంది. దీంతో ఆమె ఆవేదన విన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం నీకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రజనీకి ఉద్యోగం ఇస్తూ రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాడో లేదో అలా వెంటనే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని జనాలు హర్షిస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేదని, ఇన్నాళ్లు ప్రజలు మౌనంగా కష్టాలను భరించారని, మేం పాలకులం కాదు ప్రజా సేవకులం అని, ఇకపై ప్రగతి భవన్ తలుపులు తెరిచే ఉంటాయి అని, కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం అని, ఇవాల్టి నుంచి అమరవీరుల కుటుంబాలు ఉద్యోగుల ఆశయాలను నెరవేర్చుతామని రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇక తొలి సంతకంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజిని కి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు కూడా నెరవేరుతాయని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది