CM Revanth Reddy : కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : నల్గొండ బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తప్పులన్ని చేసి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నిజంగా సత్యహరిశ్చంద్రుడే అయితే అసెంబ్లీకి రావాల్సింది అన్నారు. అలా కాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పై ఎదురు దాడి చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో కూలిన పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిచూపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాటల పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడు అయితే అసెంబ్లీకి రావాల్సి ఉంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించింది. బీఆర్ఎస్ నల్గొండ సభకు వెళ్ళిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు. నల్గొండ దగ్గరా..అసెంబ్లీ దగ్గరా.. కెసిఆర్ సభ పెట్టి సానుభూతి పొందాలని చూస్తున్నారు. మీ దోపిడీకి మేడిగడ్డ బలైంది. అన్నారం, సుందిళ్ళ సున్నమైంది. సక్కగా లేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎలా మద్దతు తెలిపారు అని హరీష్ రావును అన్నారు. తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించాల్సింది. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సభకు వచ్చి చెప్పాలి. మమ్మల్ని వెంటాడుతా అని అంటున్నాడు. మీలాగా ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము అధికారం చేపట్టలేదు. మేడిగడ్డ కుంగిన కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు.

కాళేశ్వరం సమస్యను పక్కదారి పట్టించేందుకు నల్గొండ సభ పెట్టారు. బాధ్యత విస్మరించి కేసీఆర్ సభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. కుర్చీ పోగానే కేసీఆర్ కు ఫ్లోరైడ్ బాధితులు, నీళ్లు గుర్తుకొచ్చాయని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విపక్ష నేతగా కేసీఆర్ బుధవారం నాడు సభకు రావాలని అన్నారు. స్వార్థం కోసం ప్రజలను వాడుకోవద్దు. కేఆర్ఎంబి విషయంలో ఏనుగు పోయింది తోక మిగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. నీళ్లు నింపితే మేడిగడ్డ కుప్పకూలికను ఇంత పెద్ద లోపాన్ని చిన్నతప్పిదంగా చెబుతున్నారు. కేసీఆర్ ఓట్లు అడుక్కోవడానికి కొత్త అవతారం ఎత్తారు. ఇప్పుడు వీల్ చైర్ డ్రామా ఆడుతున్నారు. నల్గొండ సభకు జనం రాకుంటే మహబూబ్ నగర్ నుంచి తీసుకెళ్లారని తీవ్రస్థాయిల ధ్వజమెత్తారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది