CM Ys Jagan : ఆల్ పార్టీస్ నేతలకు సీఎం జగన్ ఓపెన్ చాలెంజ్ వీడియో వైరల్..!!
CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులను నిత్యం ప్రజలలో ఉండే మాదిరిగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు కార్యక్రమాలను వాళ్ళకి అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిస్తే ఇంకా దాదాపు 30 సంవత్సరాలు పాటు తిరిగి ఉండదని.. కనుక ప్రతి ఒక్కరు కష్టపడాలని జగన్ కోరుతున్నారు. మరోపక్క ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో రైతుల సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి బహిరంగ సమావేశంలో..టీడీపీ, జనసేన నేతలపై వైయస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. తాను చేస్తున్న పాలనలో గతం కంటే తక్కువ అప్పులు చేసిన గాని అందరికీ సంక్షేమ పథకాలు డబ్బులు అందుతున్నాయి. మరి తనకంటే ముందు ప్రభుత్వం ఎన్నో అప్పులు చేయడం జరిగింది. అయితే మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి.. అని ప్రశ్నించారు.
ప్రజలందరూ నేను మంచి చేశాను అని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి. చంద్రబాబు నాయుడు కి మాదిరిగా నాకు ఎల్లో మీడియా లేదు దత్తపుత్రుడు లేదు కేవలం దేవుడి దయ మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు సవాలు కూడా విసిరారు. 175 నియోజకవర్గాలలో తనపై సింగిల్ గా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి ఉందా అని సవాల్ విసిరారు. జగన్ అప్పటి చాలెంజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
