CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది. ఈ సందర్భంగా ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్ నుంచి మొబైల్స్ వరకూ ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ విభాగంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా పలు ఆకర్షణీయ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి.

#image_title
రూ.15,000 లోపల CMF Phone 2 Pro
ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు శుభవార్తగా మారింది CMF Phone 2 Pro డీల్. రూ.18,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ.15,999 కి లభిస్తోంది. అంటే ఫ్లాట్‌గా రూ.3,000 తగ్గింపు.ఇదే కాదు… ICICI, HDFC, SBI, Kotak బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో చెల్లింపులకు అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
స్పెసిఫికేషన్లు & ఫీచర్లు:
డిస్‌ప్లే:
6.77 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్
120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
3000 నిట్ పీక్ బ్రైట్‌నెస్
1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్
ప్రాసెసర్:
MediaTek Dimensity 7300-Pro 5G చిప్‌సెట్
బ్యాటరీ:
5000mAh కెపాసిటీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా సెటప్:
50MP ప్రైమరీ కెమెరా
50MP టెలిఫోటో లెన్స్
8MP అల్ట్రావైడ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 16MP సెల్ఫీ
మొత్తం మీద ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, సూపర్ AMOLED డిస్‌ప్లే గల 5G ఫోన్‌ను రూ.15,000 కంటే తక్కువ ధరలో పొందాలనుకునే వారికి CMF Phone 2 Pro బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.