Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..
ప్రధానాంశాలు:
Redmi: రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ..200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు రెడ్మీ Redmi సిద్ధమవుతోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ తన కొత్త మిడ్-రేంజ్ 5జీ ఫోన్ Redmi Note 15 Pro 5G ను జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 200MP కెమెరా శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్ భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ డివైస్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..
Redmi Note 15 Pro 5G:ప్రీ-సేల్స్ ప్రారంభం..ధర వివరాలు
రెడ్మీ ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయకముందే ప్రీ-సేల్స్‌ను ప్రారంభించడం విశేషం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో పాటు రెడ్మీ అధికారిక వెబ్‌సైట్‌లో Redmi Note 15 Pro 5G ప్రీ-బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. లీకుల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 24,999 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ డివైస్ రెండు ప్రధాన వేరియంట్స్‌లో విడుదల కానుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌తో పాటు, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనుంది. మరికొన్ని హైఎండ్ వేరియంట్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Redmi Note 15 Pro 5G: డిస్‌ప్లే,ప్రాసెసర్..ప్రీమియం అనుభూతి
Redmi Note 15 Pro 5G లో 6.83 ఇంచ్ 1.5K OLED అమోలెడ్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. 1280 x 2772 పిక్సల్స్ రిజల్యూషన్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉండడం వల్ల స్క్రీన్ భద్రత కూడా మెరుగ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఇది హై-స్పీడ్ మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు అనువుగా రూపొందించబడింది. అలాగే ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఈ ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుంది.
Redmi Note 15 Pro 5G:కెమెరా, బ్యాటరీ..ఇతర ఫీచర్లు
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రెడ్మీ ఈ ఫోన్‌లో 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను అందిస్తోంది. దీనితో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విభాగంలో Redmi Note 15 Pro 5G నిజంగా ఆకట్టుకుంటుంది. 6580mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల దీర్ఘకాలం వినియోగానికి ఇది సరైన ఎంపికగా మారనుంది. అదనంగా అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP68/IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, AI ఫీచర్స్, 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ సిల్వర్ యాష్, కార్బన్ బ్లాక్, మిరేజ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. Redmi Note 15 Pro 5G మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.