College Management : బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆ కాలేజ్ లో ఎంట్రీ లేదు .. అమ్మాయిలకి బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిన మ్యానేజ్మెంట్..!
College Management : మీరు విన్నది నిజమే. ఓ కాలేజీ మేనేజ్మెంట్ అమ్మాయిలకి కొత్త రూల్ పెట్టారు. ఇది విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఇదెక్కడి రూల్. ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఇలాంటి రూల్స్ పెడతారా అని కొందరు విమర్శిస్తున్నారు. ఏ కాలేజీలోనైనా కొన్ని రూల్స్ ఉంటాయి. క్రమశిక్షణతో నడుచుకోవాలి అని ఏ కాలేజ్ అయినా చెబుతుంది. అంతేగాని ప్రేమ దోమ అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. కానీ తాజాగా ఓ కాలేజీ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. త్వరలోనే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు రాబోతుంది.

College Management set new rule for girls
దానికంటే ముందు మరికొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అవే రోజ్ డే, చాక్లెట్ డే, హగ్గింగ్ డే, కిస్ డే ఇలా ఏడు రోజుల దాకా ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ డే ఉంటుంది. చివరి రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఉంటుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ప్రేమికులు. ఈ క్రమంలోని ఓ కాలేజీ పెట్టిన రూల్ కి అందరూ షాక్ అవుతున్నారు. ఈ కొత్త రూల్ ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్‌లో ఎస్‌వీఎమ్ కాలేజ్ లో పెట్టారు. ఈ కాలేజీలో అబ్బాయిలు, అమ్మాయిలు చదువుకుంటున్నారు.
ఫిబ్రవరి 14 త్వరలోనే రాబోతుండడంతో కాలేజీ ప్రిన్సిపల్ ఓ సర్క్యులర్ ను జారీ చేశారు. ఈ సర్క్యులర్ లో కాలేజీలోని ప్రతి అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ కచ్చితంగా ఉండాలి అని రాసి ఉంది. అమ్మాయిల సెక్యూరిటీ కోసం బాయ్ ఫ్రెండ్ ఉండాలని అందులో రాసి ఉంది. ఇటీవల బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తే కాలేజీలోకి ఎంట్రీ ఉంటుంది. లేదంటే కాలేజీకి అనుమతి లేదని అందులో ఉంది. ఇది విన్న వారంతా ఈ రూల్ మా కాలేజీలో కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు. కొందరు మాత్రం స్టూడెంట్స్ ను కాలేజీ యాజమాన్యాలే చెడగొడితే ఎలా అంటూ మండిపడుతున్నారు.