Categories: News

Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..!

Advertisement
Advertisement

Gas Cylinder : ద‌స‌రా ముందు ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా గ్యాస్ ధ‌ర‌లు పెంచి ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో వరుసగా తగ్గించుకుంటూ వచ్చిన గ్యాస్ ధరల్ని మళ్లీ పెంచుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లను యథాతథంగానే ఉంచుతున్నప్పటికీ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని చమురు మార్కెటింగ్ సంస్థలు క్ర‌మంగా పెంచుతున్నాయి. ఇలా పెంచడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

Advertisement

Gas Cylinder పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు..

సవరించిన ధరలు నేటి (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఈ గ్యాస్ సిలిండర్ రేటు అంతకుముందు రూ. 1691.50 వద్ద ఉండగా.. మరో రూ. 48.50 పెంచి ఇప్పుడు దానిని రూ. 1740 కి చేర్చింది. దాని కంటే ముందు సెప్టెంబర్ నెలలో ఇది రూ. 39 పెరిగింది. ఆగస్టు నెలలో కూడా స్వల్పంగా పెరగ్గా.. దాని కంటే ముందు వరుసగా 4 నెలల్లో దాదాపు రూ. 150 కిపైగా తగ్గించాయి. ఇప్పుడు మాత్రం పెరుగుతున్నాయి.

Advertisement

Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..!

కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.ప్రస్తుతం ఈ రేట్లు ఢిల్లీలో రూ. 803 గా ఉండగా.. ముంబైలో రూ. 802.50 పలుకుతోంది. చెన్నైలో రూ. 805.50 గా ఉండగా.. ఇదే హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధరలు రూ. 855 వద్ద ఉన్నాయి.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే.. రెస్టారెంట్లు, హోటల్స్, స్మాల్ స్కేల్ మానుఫ్యాక్చరర్స్ వంటి వాటిపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. అంటే.. దానికి తగ్గట్లుగా అక్కడ ఆహార పదార్థాల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో బయట ఫుడ్ మరింత ప్రియంగా మారతాయని చెప్పొచ్చు

Advertisement

Recent Posts

Lymphoma : రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతున్నాయా… అయితే దీనికి సంకేతం కావచ్చు…!

Lymphoma : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం లేక…

2 hours ago

Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని…

3 hours ago

Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం…!

Aloe Vera : అలోవెరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో A, C, E విటమిన్స్ మరియు…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…!

Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం…

5 hours ago

Roja : ప‌వ‌న్, పురంధేశ్వ‌రిల‌ని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రోజా..!

Roja : తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంతో ఏపీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు…

14 hours ago

Telangana Cabinet : రేవంత్ రెడ్డి కేబినేట్‌లోకి కొత్త మంత్రులు.. ఎవ‌రికి ఏయే శాఖ‌లు కేటాయించ‌నున్నారంటే..!

Telangana Cabinet : తెలంగాణ లో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన…

15 hours ago

Kutami : ఇప్ప‌టికైన కూట‌మి సర్కార్ క‌ళ్లు తెర‌వాలంటూ ఫైర్.. ఏం జ‌రుగుతుందంటూ చ‌ర్చ‌

Kutami : కొద్ది రోజుల క్రితం వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ని అల్ల‌క‌ల్లోలం చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అప్పుడు ప్ర‌భుత్వం సాయం…

16 hours ago

Chandrababu : చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు.. ఆయ‌న క్ష‌మాప‌ణలు కోర‌తారా..!

Chandrababu : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తిరుమల…

17 hours ago

This website uses cookies.