
Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వచ్చేది ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది మందా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ రాను రాను ఆసక్తికరంగా మారుతుంది. గత వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఆమెని నాగుపాముగా వర్ణించిన నెటిజన్లు, ఆమెని ఎలిమినేట్ చేసేంత వరకు నిద్ర పోలేదని చెప్పాలి. ఆమెకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో క్యాంపెయిన్ జరిగింది. ఇందులో నిఖిల్ ఫ్యాన్సే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోనియా మాయలో పడి నిఖిల్ ఆట బాగా ఆడటం లేదనే కామెంట్స్ వచ్చాయి. నిఖిల్‌ని, పృథ్వీని తన కంట్రోల్‌లో పెట్టుకుని వారిని చెడగొడుతుందనే ట్రోలింగ్ నడిచింది. మొత్తంగా సోనియా బిగ్ బాస్‌ని వీడింది. ఇక సోనియా ఎలిమినేషన్‌తో నిఖిల్‌కి బ్రెయిన్ వాష్ చేస్తుంది యష్మి. గేమ్ ఆడాలని, మనుషులు ముఖ్యం కాదని చెబుతుంది.
ఇక సోమవారం (29వ) రోజు ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరిగింది. నాలుగు వారాలు చాలా వాడి వేడిగా నామినేషన్ల ప్రక్రియ జరిగింది. కానీ ఐదో వారం మాత్రం ఆ వేడి కనిపించడం లేదు. పైగా నామినేట్ చేసేటప్పుడు ఆ కంటెస్టెంట్ ఫోటోలు మంటలో వేయాల్సింది. అందులో మంటలు ఉన్నాయి, కానీ కంటెస్టెంట్లు వాదనలో అంతటి ఫైర్ కనిపించలేదు. దీంతో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ చాలా చప్పగా సాగింది. అయితే మణికంఠ ఇన్నాళ్లు చాలా కామ్ గోయింగ్‌గా ఉండగా,అతను పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కూడా అనిపించలేదు. కాని చూడబోతుంటే అటు యష్మి, ఇటు పృథ్వీ.. మణికంఠకి హైప్ ఇస్తున్నారు. ఆయన్ని హీరో చేస్తున్నారు. ప్రతి సారి అతన్నే టార్గెట్ చేస్తూ వాళ్లు జీరో అవుతున్నారు. మణికంఠని హీరోని చేస్తున్నారు. వీరి టార్గెటే అతనికి సింపతిగా మారుతుంది. మణికంఠని టార్గెట్ చేసిన వాళ్లంతా పరోక్షంగా అతన్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుస్తున్నారు.
Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి వచ్చేది ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది మందా..!
ఇక బిగ్ బాస్ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా పది మంది రాబోతున్నారట. వైల్డ్ కార్డ్ ద్వారా యాంకర్ రవి రాబోతున్నాడట. యాంకర్ రవితోపాటు మెహబూబ్ దిల్సే కూడా రాబోతున్నారట. ఆయన కూడా కన్ఫమ్ అయినట్టు సమాచారం. కొత్తగా గంగవ్వ పేరు తెరపైకి వచ్చింది. గత సీజన్‌లో సందడి చేసిన గౌతమ్ కృష్ణ కూడా రాబోతున్నారట. నయని పావని కూడా ఈ సారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్‌లోకి అడుపెడుతున్నట్టు సమాచారం. శోభాశెట్టిని మళ్లీ తీసుకురాబోతున్నారట. గత సీజన్‌లోనే ఫన్‌తో ఆకట్టుకున్న టేస్టీ తేజని సైతం వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి దించుతున్నారట. అలాగే హరితేజని కూడా తీసుకురాబోతున్నారు. ఇలా సుమారు పది మంది మాజీ కంటెస్టెంట్లని బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారట.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.