Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..!

Gas Cylinder : ద‌స‌రా ముందు ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా గ్యాస్ ధ‌ర‌లు పెంచి ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో వరుసగా తగ్గించుకుంటూ వచ్చిన గ్యాస్ ధరల్ని మళ్లీ పెంచుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లను యథాతథంగానే ఉంచుతున్నప్పటికీ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని చమురు మార్కెటింగ్ సంస్థలు క్ర‌మంగా పెంచుతున్నాయి. ఇలా పెంచడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

Gas Cylinder పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు..

సవరించిన ధరలు నేటి (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఈ గ్యాస్ సిలిండర్ రేటు అంతకుముందు రూ. 1691.50 వద్ద ఉండగా.. మరో రూ. 48.50 పెంచి ఇప్పుడు దానిని రూ. 1740 కి చేర్చింది. దాని కంటే ముందు సెప్టెంబర్ నెలలో ఇది రూ. 39 పెరిగింది. ఆగస్టు నెలలో కూడా స్వల్పంగా పెరగ్గా.. దాని కంటే ముందు వరుసగా 4 నెలల్లో దాదాపు రూ. 150 కిపైగా తగ్గించాయి. ఇప్పుడు మాత్రం పెరుగుతున్నాయి.

Gas Cylinder పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు రేట్లు ఎలా ఉన్నాయంటే

Gas Cylinder : పండ‌గ ముందు గ్యాస్ ధ‌ర‌లు పెంపు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..!

కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.ప్రస్తుతం ఈ రేట్లు ఢిల్లీలో రూ. 803 గా ఉండగా.. ముంబైలో రూ. 802.50 పలుకుతోంది. చెన్నైలో రూ. 805.50 గా ఉండగా.. ఇదే హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధరలు రూ. 855 వద్ద ఉన్నాయి.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే.. రెస్టారెంట్లు, హోటల్స్, స్మాల్ స్కేల్ మానుఫ్యాక్చరర్స్ వంటి వాటిపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. అంటే.. దానికి తగ్గట్లుగా అక్కడ ఆహార పదార్థాల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో బయట ఫుడ్ మరింత ప్రియంగా మారతాయని చెప్పొచ్చు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది