Congress : రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ వినూత్న కార్యక్రమం
Congress : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురం సాయి ప్రియ కాలనీలో తుంగతుర్తి రవి కార్యాలయంలో బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో “జై బాపు – జై భీం – జై సంవిధాన్”కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ,డా.బి.ఆర్. అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుని,భారత రాజ్యాంగ పరిరక్షణ పట్ల ప్రతి పౌరుడి యొక్క బాధ్యతను గుర్తుచేశారు. భారత దేశ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడుతూ,సామాజిక న్యాయం, సమానత్వం,మానవహక్కులపై మాట్లాడారు.

Congress : రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ వినూత్న కార్యక్రమం
పీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు మాట్లాడుతూ,“భారత రాజ్యాంగం మన హక్కులను కాపాడే శక్తివంతమైన ఆయుధం అందరం దీన్ని గౌరవిస్తూ,ప్రజల్లో సామాజిక స్పృహ పెంచాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.ఈ కార్యక్రమం గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని, అంబేద్కర్ గారి సామాజిక న్యాయ దృక్పథాన్ని,మరియు రాజ్యాంగంలోని విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ డిప్యుటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేషన్ 1 వ డివిజన్ ఇంచార్జి మజర్, 2వ డివిజన్ ఇంచార్జ్ (మహిళా అధ్యక్షురాలు)శ్రీలత భద్రు నాయక్,3వ డివిజన్ ఇంచార్జి సుదర్శన్ రెడ్డి, 4వ డివిజన్ ఇంచార్జ్ యసారం నగేష్, 5వ డివిజన్ ఇంచార్జ్ ముదిగొండ రమేష్, 6వ డివిజన్ ఇంచార్జ్ వంగూరి పరమేష్, 7వ డివిజన్ ఇంచార్జి మోహన్, 9వ డివిజన్ ఇంచార్జ్ జంగా చారి, 10వ డివిజన్ ఇంచార్జ్ కవిడె కుమార్, 11 వ డివిజన్ ఇంచార్జ్ రంజిత్ కుమార్ రెడ్డి, 15 వ డివిజన్ ఏ బ్లాక్ ఇంచార్జ్ నాగరాజు,19వ డివిజన్ ఇంచార్జ్ సోమయ్య, 21 వ డివిజన్ ఇంచార్జ్ బండిరాళ్ల భాస్కర్, 23వ డివిజన్ ఇంచార్జ్ పవన్ గౌడ్ మరియు వెంకటేష్ గౌడ్, అంజమ్మ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.