Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

 Authored By suma | The Telugu News | Updated on :7 February 2026,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

Revanth Reddy : రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు Godavari waters  అందకుండా మాజీ సీఎం కేసీఆర్ KCR అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి CM Revanth Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలకంటే పక్క రాష్ట్రాలకే ఎక్కువగా పనిచేశారని అన్నారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఏటా సుమారు 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే వాటిలో కనీసం 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు మళ్లించి ఉంటే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందేదని ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని వదిలేసి జిల్లాను ఎండబెట్టారని ఆరోపించారు.

Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

Revanth Reddy : రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి

తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి  Welfare and development సమాంతరంగా కొనసాగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు. అప్పులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి పోటీ చేయాల్సిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బొందపెట్టారని, కాంగ్రెస్‌తో నేరుగా పోటీ చేయలేక బీజేపీతో కలిసిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థుల బీఫామ్‌లు బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో పంచే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Revanth Reddy : కాళేశ్వరం నుంచి ‘కూలేశ్వరం’ వరకు

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు  Pranahita Chevella Project ను నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  YS Rajasekhar Reddy రూ.38 వేల కోట్లతో ప్రారంభించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్పుకున్న కేసీఆర్ అదే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే ‘కూలేశ్వరం’గా మారిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మేలు కాకుండా కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌస్‌లు మాత్రమే వచ్చాయని గోదావరి జలాల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను తీసుకువచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం హామీ ఇచ్చారు. ఈ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు సహా స్థానిక నేతలు పాల్గొన్నారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి