Telangana : కాంగ్రెస్ కు భారీ షాకిచ్చి బీజేపీలో చేరిన కీలక నేత
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేకుండా పోయింది. తాజాగా మరో కీలక నేత పార్టీని వీడారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు తన పదవులకు అన్నింటికీ రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

congress leader kuna srisailam joins in bjp
తెలంగాణకు చెందిన బీజేపీ నేతలతో కలిసి కూన శ్రీశైలం గౌడ్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, కే లక్ష్మణ్ ఉన్నారు.
Telangana : కుత్బుల్లాపూర్ లో బలమైన నేతగా కూన శ్రీశైలం గౌడ్
కూన శ్రీశైలం గౌడ్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ తరుపున బలమైన నేతగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో… స్వతంత్రంగా పోటీ చేసి అక్కడ గెలిచారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

congress leader kuna srisailam joins in bjp
కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా సరిగ్గా ఉండటం లేదు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది. ప్రజా సమస్యలపై పట్టించుకోవడం లేదు. కేవలం పదవుల కోసం పార్టీలోనే నేతలంతా కొట్టుకుంటున్నారు. నేను ఎప్పుడూ ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను. ప్రజాపోరాటం చేయాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం. అందుకే.. బీజేపీలో చేరుతున్నా.. అంటూ కూన శ్రీశైలం గౌడ్.. ఒక వీడియోను తన అభిమానుల కోసం విడుదల చేశారు.