Coolie | కూలీ ప్రభంజనం.. తొలి రోజు ఎంత సాధించిందో అఫీషియల్‌గా ప్రకటించిన మేకర్స్
Coolie | సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ‘కూలీ’ సినిమా, విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.
#image_title
సరికొత్త రికార్డు!
సినిమా యూనిట్ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం, ‘కూలీ’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹151 కోట్ల గ్రాస్ వసూలు చేసి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది.ఇంతవరకు తమిళ్ సినిమాల్లో డే-1 అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమా విజయ్ నటించిన ‘లియో’ (₹148 కోట్లు). ఇప్పుడు ఆ రికార్డును ‘కూలీ’ బ్రేక్ చేసి అగ్రస్థానంలోకి చేరింది.
‘కూలీ’ అమెరికాలోనే $3 మిలియన్ (సుమారు ₹25 కోట్లు) గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ₹20 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటి వరకు రజినీ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ‘జైలర్’ నిలిచింది (₹100 కోట్లు), అలాగే ‘రోబో 2.0’ రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలను దాటేసి ‘కూలీ’ రజినీ కెరీర్‌లో ఓపెనింగ్ డే బ్లాక్‌బస్టర్గా నిలిచింది.