Covid Vaccination for Kids : 12 -14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు?
Covid Vaccination for Kids : కరోనా థర్డ్ వేవ్ ముగింపు దశలో ఉన్నాం ఇప్పుడు. అయితే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీలో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయింది. అమెరికాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమయింది.ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ ను అందిస్తున్నారు. దాదాపుగా అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. కొందరైతే బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు. 15 నుంచి 17 ఏళ్ల వయసు వాళ్లకు కూడా ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రారంభించారు.
Covid Vaccination for Kids : బుధవారం నుంచే 12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ ప్రారంభం
ఈ బుధవారం నుంచే అంటే మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ ను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ పేరు కార్బెవ్యాక్స్.అలాగే.. మార్చి 16 నుంచి 60 ఏళ్లు దాటిన వాళ్లకు ప్రికాషన్ డోస్ కూడా అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 60 ఏళ్లు దాటి రెండు డోసులు వేసుకున్న వాళ్లు ఖచ్చితంగా ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా సూచించారు.
Covid Vaccination for Kids : రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ కోసం కోవిన్(www.cowin.gov.in) వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ రిజిస్టర్ / సైన్ ఇన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ చేసుకొని ఉంటే.. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వొచ్చు.లేదంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వయసు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అటువంటివేవీ లేకపోతే స్కూల్ ఐడీ కార్డును అయినా ప్రూఫ్ గా చూపించవచ్చు.రిజిస్టర్ చేసుకున్న తర్వాత తేదీ, సమయం, సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఆ సమయానికి పిల్లలను తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించాలి.