Covid Vaccine : అలెర్ట్..15-18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు..!

Authored By Inesh A | The Telugu News | Updated on: December 27, 2021, 4:15 pm

Covid vaccine : దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఆ మేరకు వచ్చే జనవరి 3 వ తేదీ నుండి దేశంలో 15 నుండి 18 ఏళ్ల వయసు వారికి కోవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడి గత వారం మన్ కి బాత్ లో ప్రకటించారు. టీకా కోసం

జనవరి 1 నుండి కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్‌, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు విద్యాసంస్థలు జారీ చేసే స్టూడెంట్‌ ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని వెల్లడించింది. ఇక 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వృద్దులకు వైద్యుల సలహా మేరకు..

Covid vaccine registrations begin Jan. 1 for 15- to 18-year-olds

Covid vaccine registrations begin Jan. 1 for 15- to 18-year-olds

ముందు జాగ్రత్తగా ప్రికాషన్‌ డోసును అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఆరోగ్య విభాగ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకా డోసును వేయనున్నట్లు వెల్లడించింది.

Inesh A

No bio available for this author.

  1. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  2. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  3. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  4. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  5. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  6. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

  7. "Naresh : పెళ్లి వద్దన్నా పర్లేదు.. పిల్లల్ని కనండి..! వివాదంపై వీకే నరేశ్ క్లారిటీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp