Lungs Health : ఒమిక్రాన్ భయానక పరిస్థితుల్లో.. ఊపిరితిత్తులను ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి..
Lungs Health : కరోనా విపత్కర పరిస్థితులు మళ్లీ ఏర్పడుతున్నాయి. కరోనా ఇక ముగింసిందని అనుకునేలోపే మరో సరికొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది.ఇటీవల ఒమిక్రాన్, డెల్ట్రాకాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనాలు భయపడిపోతున్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చేసిందని కొందరు అంటున్నారు కూడా. ఇకపోతే కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకుగాను ప్రజెంట్ ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల ఆరోగ్యంపైన ఫోకస్ పెట్టాలి. అలా లంగ్స్‌ను హెల్దీగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొవిడ్ బారిన పడితే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులే అన్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఊపిరితిత్తులలో కఫం, శ్లేష్మం లేకుండా క్లీన్‌గా ఉంచుకోవాలి. అందుకుగాను ఇలా చేయాలి. ఒకవేళ మీకు పొగ తాగే అలవాటు అనగా సిగరెట్, బీడి తాగే అలవాటుంటే మానుకోవాలి. గాలిలో ఉండే విషపదార్థాలు, కాలుష్య కారకాలతో పాటు పొగ తాగడం వలన ఊపిరితిత్తులు బలహీనంగా మారుతాయి. అలా ఊపిరితిత్తులు బలహీనమవుతాయి. కాబట్టి వాటిని బలంగా ఉంచుకునేందుకుగాను ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి.
Lungs Health : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం..
దానిమ్మను కంపల్సరీగా రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవాలి. దానిమ్మలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్ కు చాలా మంచివి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అవి బాగా ఉపయోగపడుతాయి. యాపిల్ ఫ్రూట్ కూడా లంగ్స్ ను హెల్దీగా ఉంచుతాయి. యాపిల్ లో ఉండే విటమిన్స్ బీ, సీ, ఈ.. ఫ్లేవనాయిడ్స్ లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇకపోతే ప్రతీ రోజు ఉదయాన్నే అనగా పరగడుపున గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో ఉండే కఫం, శ్లేషం బయటకు వెళ్లిపోతాయి. అలా ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. మార్నింగ్ టైమ్స్‌లో పుదీనా ఆకులు కూడా తీసుకోవడం మంచిది. వాటి వలన హెల్త్ కు చాలా మంచిది. లంగ్స్ ను క్లీన్ చేయడంలో అవి కూడా కీ రోల్ ప్లే చేస్తాయి.