Vaccine : ముక్కు నుంచే కోవిడ్ వ్యాక్సిన్… వాక్సిన్ కు అనుమతి ఇచ్చిన కేంద్రం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vaccine : ముక్కు నుంచే కోవిడ్ వ్యాక్సిన్… వాక్సిన్ కు అనుమతి ఇచ్చిన కేంద్రం…

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,6:00 am

Vaccine : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ కరోనా వైరస్ వలన ప్రతి ఒక్కరు చాలా నష్టపోయారు. ఆర్థికంగా ఎంత కృంగిపోయారో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రజలు బయటకు రావటానికి కూడా చాలా భయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ రావటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ముక్కు ద్వారా ఇవ్వడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. భారత్ బయోటెక్ తయారుచేసిన నాసల్ వ్యాక్సిన్ కు డిసిజిఐ అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీగా వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంట్రా నాసల్ కోవిడ్ 19 టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మనుసుక్ మాండవియా వెల్లడించారు.

ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమతి దక్కడం ఇదే మొదటిసారి. ఇప్పటికే భారత్ బయోటెక్ కు చెందిన పోరాటంలో ఇండియా ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ కోసం బూస్టర్ డోస్ గా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డిసిజిఐ గతంలో అనుమతి ఇచ్చింది. BBV-154 ఇమ్యూనోజెనిసిటీ భద్రతను కోవాక్సిన్ తో పోల్చడానికి ఫేస్ 3 క్లినికల్ ట్రయాల్ నిర్వహించడానికి డ్రగ్ రెగ్యులేటర్ అనుమతించింది. గతవారం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(SEC) భారత్ బయోటెక్ ఇంట్రా నాసల్ కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూస్ ఆర్థరైజేషన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Bharat Biotech Made The Intra Nasal Kovid Vaccine

Bharat Biotech Made The Intra Nasal Kovid Vaccine

ఇంతకుముందు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదని ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. కోవిడ్ 19 ప్రసారం రెండింటిని నిరోధించే అవకాశం ఉంది. నాన్ ఇన్వసివ్ సూది రహితగా ఇది ఉంటుంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు అవసరం లేదు కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఈజీ. సూది సంబంధిత ప్రమాదాలను గాయాలు, అంటు వ్యాధులను తొలగిస్తుంది. పెద్దలకు, పిల్లలకు అందరికీ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను ఇది తీర్చగలదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది