Gold Chain : గోల్డ్ చెయిన్ మింగేసిన ఆవు.. తర్వాత ఏమైందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gold Chain : గోల్డ్ చెయిన్ మింగేసిన ఆవు.. తర్వాత ఏమైందంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :12 December 2021,9:40 am

Gold Chain : ఆవును భారతీయులకు అత్యంత ప్రియమైనది. గోమాత అని పిలుస్తూ..ఆవును పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇకపోతే ఆవును ఇంటి లోపల గృహ ప్రవేశం సందర్భంగా ఇంటి లోనికి తీసుకెళ్లడం మన పూర్వీకుల దగ్గరి నుంచి వచ్చిన ఆచారం. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు కూడా. ఈ సంగతులు పక్కనబెడితే.. ఓ ఆవు వింత పని చేసిందండోయ్.. ఇంతకీ ఏం చేసిందంటే..కర్నాటక రాష్ట్రంలో ఓ వింత ఘటన జరిగింది. ఆవు గోల్డ్ చెయిన్‌ను మింగేసింది.

ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..కర్నాటక స్టేట్‌లోని ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్‌ హెగ్డె కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి. వీరు గోమాత అంటూ ఆవును ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఆవుల కోసం సెపరేట్‌గా పూజలు చేశారు. దీపావళి సందర్భంగా ఆవులకు ప్రత్యేకమైన పూజలు చేశారు.  ఈ క్రమంలోనే ఆవులను అత్యంత సుందరంగా అలంకరించారు. ఆవులకు పూల మాలలు వేయడంతో పాటు బంగారు ఆభరణాలూ వేశారు. కాగా, అనుకోకుండా దూడకు వేసిన గోల్డ్ చెయిన్‌ను తీసేయడం మరిచిపోయారు. దాంతో అది పూల మాలలో కలిసి ఎక్కడ పడిందోనని వెతకడం ప్రారంభించారు.

cow swallows gold chain

cow swallows gold chain

Gold Chain : నెల రోజుల నుంచి బంగారు చెయిన్ కోసం వెతుకుతున్నారు.. చివరకు..

దాదాపుగా ఆవుల షెడ్డు, పేడ, ఇతర ప్రదేశాల్లో వెతుకుతున్నారు. ఎంతకీ దొరకకపోడంతో ఆవు మింగేసిందేమోననే అనుమానం వచ్చింది. దాంతో వెంటనే ఆవు యజమాని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆవును పరీక్షించి చూడగా, ఆవు పొట్టలో గోల్డ్ చెయిన్ ఉన్నట్లు గుర్తించారు.
దాంతో ఇక సర్జరీ చేసి గోల్డ్ చెయిన్ బయటకు తీశారు. 20 గ్రాములు ఉండాల్సిన చెయిన్ 18 గ్రాములకు వచ్చింది. మిగిలిన రెండు గ్రాములు ఆవుపొట్ట లోపల రిలీజ్ చేసిన యాసిడ్స్ వల్ల కరిగిపోయిందని వైద్యుడు వివరించాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది