Cow Cobra Snake : ఆవు, పాము దోస్తీ దోస్తీ… పడగని నాలుకతో నాకిన గోమాత.. వైరల్ వీడియో !
ప్రధానాంశాలు:
Cow Cobra Snake :ఆవు, పాము దోస్తీ దోస్తీ... పడగని నాలుకతో నాకిన గోమాత..!
Cow Cobra Snake : ఇటీవలి కాలంలో పాముల బెడద చాలా ఎక్కువైంది. పాములని చూస్తే మనుషులతో పాటు జంతువులు కూడా కాస్త భయపడుతుంటాయి. పాములు సైతం జంతువులకు దగ్గరగా వెళ్లడానికి అంతగా ఇష్టపడవు. మరుగు ప్రదేశాల్లో ఉండేదుకు ఇష్టపడే సర్పాలు.. ఏదైనా అలికిడి చేస్తే చాలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ ఓ పాము మాత్రం ఆవుతో స్నేహం చేస్తోంది. ఆవు తన నాలుక మీద నల్ల త్రాచు పడగను ఉంచినప్పటికీ.. ఆ పాము దాన్ని కాటేయకపోవడం ఆవు, పాముల మధ్య స్నేహానికి అద్దం పడుతోంది. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Cow Cobra Snake స్నేహం బాగుంది..
పొలంలో గడ్డి మేస్తున్న ఆవుకు ఉన్నట్టుండి ఓ నాగు పాము కనిపించింది. దాన్ని చూడగానే దూరంగా పారిపోవాల్సిన ఆవు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. చిన్న నాటి తన మిత్రుడు కనిపించినట్లుగా.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెడుతూ తన ప్రేమంతా కురిపించింది. అక్టోబర్ 10, 2024న ‘మాసిమో’ X ఖాతా లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో అందర్నీ షాక్ గురిచేసింది. ఈ వీడియోలో ఆవు నాగుపాముని పదే పదే నొక్కుతూ తన ప్రేమను చూపెట్టినట్లు కనిపించింది. అలాగే ఎప్పుడు కోపంగా ఉద్వేగంగా ఉండే పాము సైతం సైలెంట్‌గా ఆవుపై దాడి చేయకుండా పక్కకు జరుగుతుంది. ఈ దృశ్యాలను చూస్తే అందరికి కొత్తగా అనిపించింది.

Cow Cobra Snake : ఆవు, పాము దోస్తీ దోస్తీ… పడగని నాలుకతో నాకిన గోమాత..!
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రెండు మంచి స్నేహితుల్లా ఉన్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ సీన్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. “ఈ వీడియో చూస్తే నా 14 ఏళ్ల కొడుకును పాఠశాలకు ముందు అతని తల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించినా సంఘటనను గుర్తుకు తెచ్చింది” అని పేర్కొన్నారు. “ప్రేమ అనేది మాట్లాడని భాష అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ అరుదైన జంతు వైరల్ వీడియో రెండు అసంభవమైన జీవుల మధ్య ప్రత్యేకమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది.
Can you show me something more beautiful than this 😍 pic.twitter.com/e5FmqMdDGY
— Lost Temples™ (@LostTemple7) October 14, 2024