Gomata : గోమాత మహిమ గురించి పరమేశ్వరుడు చెప్పిన కథనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gomata : గోమాత మహిమ గురించి పరమేశ్వరుడు చెప్పిన కథనం

 Authored By brahma | The Telugu News | Updated on :9 May 2021,7:18 pm

Gomata : హిందువుల భక్తిగా కొలిచే గోమాత Gomata మహిమల గురించి అనేక విశేషాలు మనం విన్నాం.. ఒక్క గోమాతకు పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు మనకు చెప్పే మాటలు. గోమాత గొప్పతనం గురించి పార్వతి దేవి ఒకానొక సందర్భంలో శివుడిని అడగటంతో ఆయన గోమాత యొక్క విశిష్టతను వివరించాడు..

Cow and position of Devas - Hinduism Stack Exchange

కైలాసమున పార్వతి దేవి భక్తితో పరమశివుడిని ఇలా అడిగింది… నాధా..! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు , అంట్లు కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమగునో తెలిపామని అడగటంతో పరమేశ్వరుడు ప్రసన్న వదనంతో

Gomata : దేవి.. ! గోమాత

దేవి.. ! గోమాత Gomata నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు తొలగును. గోవు కొమ్ముల మెుదట బ్రహ్మ విష్ణువులు, కోమ్ముల చివర గంగాది తీర్ధములు, నుదురు నందు రుద్రుడు,నుదురు పై భాగమున మహాదేవుడు, నాసికాదండమున షణ్ముఖుడు, చెవులలో అశ్వనీదేవతలు, కుడికన్నులో భాస్కరుడు,ఎడమకన్నులో చన్ద్రుడు, జిహ్వలో వరుణుడు, హుంకారమున సరస్వతీదేవి, దవడలలో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు, మెడనందు ఇంద్రుడు, ఉదరమున త్రయోదశ విశ్వేదేవతలు.

shiva parvati

shiva parvati

వక్ష స్థలమున గాయత్రి, నాల్గుపాదాలలో నాల్గు వేదములు, డెక్కల మధ్య గంధర్వులు, డెక్కల చివర గరుత్మంతుడు, డెక్కల ఉభయపార్శ్వములలొ అప్సరసలు, ప్రుష్ఠమున లక్ష్మీ నారాయణులు, ఏకాదశరుద్రులు, అవయవ సంధులలో అష్టవసువులు, పిరుదలలో పిత్రు దేవతలు, తోకనందు సోముడు, తోకయందలి రోమములలో సూర్యచన్ద్రులు, మూత్రమున గంగాదేవి, పోదుగు నుండి వచ్చు పాలలో సరస్వతీదేవి, పెరుగులో నర్మదతీర్ధం, నెయ్యినందు అగ్నిహోత్రుడు, పేడయందు లక్ష్మీ దేవి, మూత్రమున గాయత్రీ దేవి, రోమములలో త్రయత్త్రింశత్కోటిదేవతలు, ఉదరమున భూమాత మెుదలగు సమస్త దేవతలుకలరు.

గోమాతకు ఐదుసార్లు ప్రదక్షణం చేసిన భూ ప్రదక్షణంతో సమానం. గోమాతను పూజిస్తే సంస్థ దేవతలను పూజించినట్లు. ఆషాడ శుద్ధ తోలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సన్నిధానం పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున పూజ చేసిన అనంత కోటి పుణ్యముల ఫలం పొందటమే కాకుండా 41 రోజులు చేసిన పూజ ఫలితం ఆ ఒక్క రోజే పొందవచ్చుని బోధించాడు పరమశివుడు

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది