
CPI Narayana Controversial Comments On pawan kalyan
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని, ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను కడిగిపారేశారు. చంద్రబాబును “స్వార్థపరుడు”గా అభివర్ణించగా, పవన్‌ను “బఫూన్”, “ఊసరవెల్లి” అంటూ కఠిన పదజాలంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి స్థిరంగా లేదని, పూటకో మాట మాట్లాడతాడని నారాయణ దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా నారాయణ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా దూకుడుగా కామెంట్స్ చేశారు. పవన్ సనాతన ధర్మాన్ని సమర్థించడం తప్పుడు అని, ఆయన నిజంగా ఆ ధర్మం అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. “సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితి మంటల్లో వేయడం. నువ్వు చస్తే నీ భార్యను చితిలో వేయగలవా?” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్‌ను “మనిషి అనాలా, జంతువు అనాలా?” అంటూ దూషించారు. కుక్కలకైనా ఒక పాలసీ ఉంటుందని, కానీ పవన్‌కు అంతకీ లేదని నారాయణ అన్నారు.
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.