Farmer : రైతుల ఖాతాల్లో రూ.కోట్లు.. అధికారులు గుర్తించేలోపే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmer : రైతుల ఖాతాల్లో రూ.కోట్లు.. అధికారులు గుర్తించేలోపే…

 Authored By mallesh | The Telugu News | Updated on :20 February 2022,7:00 pm

Farmer : ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు పేద రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమయ్యాయి. కానీ ఈ విషయంలో వారు అమాయకంగా ఉండటంతో వారి ఏటీఎం కార్డుల నుంచి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రూ.కోటి 28 లక్షలు డ్రా చేశాడు. దీంతో తమ బ్రాంచ్ నుంచి డబ్బులు భారీగా డ్రా అయ్యాయనే విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు.. రైతుల వద్దకు వెళ్లి వాటిని రికవరీ చేససేందుకు ట్రై చేశారు. దీంతో అసలు విషయంబయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ రూరల్ మండలం మామిడిగూడ పంచాయతీలోని సల్పలగూడ గ్రామానికి చెందిన రైతులకు ఆదిలాబాద్‌ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి.

వాటిలో రైతులు భీంరావు, రాంబాయి, గంగాదేవికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్నాయి. వాటి నుంచి రూ.1,28,78,000 డ్రా అయినట్లు ఇటీవల బ్యాంక్ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ కార్డు ద్వారా సుమారు రూ.2 లక్షల వరకే పరిమితి ఉంటుంది.విత్‌డ్రా అయిన డబ్బులను రికవరీ చేసేందుకు చీఫ్‌ మేనేజర్ తన సిబ్బందితో కలిసి ఇటీవల రైతుల వద్దకు వెళ్లారు. వారిన ఆరా తీయగా ఆ డబ్బులు తాము డ్రా చేయలేదని వారు చెప్పారు. అంత డబ్బు తాము డ్రా చేయలేదని మామిడిగూడ సీఎస్పీ నిర్వాహకుడు నుంచి విడతల వారీగా మొత్తం రూ.16.20 లక్షలు తీసుకున్నట్టు చెప్పారు.

crores of rupees in farmers accounts

crores of rupees in farmers accounts

మిగిలిన రూ.1,12,58,000 సీఎస్పీ నిర్వాహకుడు రైతుల పేరుతో డ్రా చేసుకున్నాడని బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. ఈ మొత్తం నాలుగు నెలలుగా డ్రా చేయడంతో తాము ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయో తెలుసుకోలేకపోయినట్లు వెల్లడించారు. ఇక సీఎస్పీ నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు రికవరీ చేసిన అధికారులు.. రైతుల కిసాన్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులను చెల్లించేందుకు రైతులు అంగీకరించడంతో పోసులకు ఫిర్యాదు చేయలేదని మేనేజర్ తెలిపారు. అయితే డబ్బులు ఆ ఖాతాల్లోకి ఎలా జమయ్యయనే విషయంపై బ్యాంక్ అధికారులు స్పందించలేదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది