Cucumber | కీర దోసకాయ ఆరోగ్యానికి వరం.. దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
Cucumber | హెల్తీ ఫుడ్స్ విషయంలో మనం తరచూ పండ్లు, కూరగాయలపై దృష్టి పెడతాం. అటువంటి వాటిలో కీర దోసకాయ (Cucumber) ఒక రిచ్ ఫుడ్‌గా గుర్తింపు పొందుతోంది. ఇందులో విటమిన్ B, C, K, పొటాషియం, ఫైబర్, మరియు ఫిసెటిన్ వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

#image_title
కీర దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు:
మధుమేహ సమస్యలపై ప్రభావం:
మధుమేహంతో బాధపడే వారికి తరచూ మూత్ర విసర్జన ఎక్కువగా కావడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కీరదోస క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డిటాక్సిఫికేషన్‌లో సహాయం:
దోసకాయలో 95% వరకు నీరు ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విషపదార్థాలను (టాక్సిన్స్) బయటకు తీయడంలో సహాయపడుతుంది. రోజూ మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది:
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, రాత్రిపూట తినడం వల్ల అపానవాయువు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
చర్మ సమస్యలకు ఉపశమనం:
హీట్ బర్న్, సన్ బర్న్, స్కిన్ అలర్జీ వంటి సమస్యల సమయంలో దోసకాయ తినడం ద్వారా చర్మానికి చల్లదనం లభిస్తుంది. దాంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది.