Curd Chicken Recipe : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టింది…అయితే ఇలా ట్రై చేయండి….
Curd Chicken Recipe : చికెన్ కర్రీను ఇష్టపడనివారు వుండరు. ఆదివారం వస్తే చాలు ఎక్కువమంది ఇళ్లల్లో చికెన్ కర్రీనే వండుతారు. అయితే రొటీన్ గా తినడం వలన కొందరు తినడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు చికెన్ ను ఎక్కువగా తినడం వలన మన బాడీలో వేడి పెరుగుతుంది. అందుకే చికెన్ కర్రీలో కొద్దిగా పెరుగును జోడించడం వలన ఆరోగ్యపరంగా మనకు హెల్దిగా వుంటుంది. అంతేకాకుండా,రొటీన్ గా కాకుండా వెరైటీగా చేసుకున్నట్లు వుంటుంది. ఇలా వెరైటీగా చేయడం వలన మనకు తినాలనిపిస్తుంది.
ఇలా ట్రై చేసిన చికెన్ కర్రీను రైస్,పూరీ,రోటీ లలో ముంచుకొని తింటే ఎంతో టేస్టీగా వుంటుంది. ఈ కర్రీను ఎలా చేయాలో,కావలసిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం…. కావలసిన పదార్థాలు: 1)చికెన్ 2)ఉల్లిపాయలు 3)పచ్చిమిర్చి 4) అల్లం వెల్లుల్లి పేస్ట్ 5)పసుపు 6)ఆయిల్ 7)జీలకర్ర 8)పెరుగు 9)ఉప్పు 10)కారం 11)గరం మసాలా 12)కొత్తిమీర తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకిలో చికెన్, ఒక టీస్ఫూన్ ఉప్పు, చిటికెడు పసుపు,అల్లం పేస్ట్ ఒక టీస్ఫూన్,పెరుగు కొద్దిగా వేసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలపాలి.
ఇలా కలిపిన దానిని ఒక అరగంట ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి,పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్ఫూన్ల ఆయిల్ వేయాలి.నూనె వేడి అయ్యాక జీలకర్ర వేయాలి.తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి.అవి కొద్దిగా మగ్గాక పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.కొద్దిగా పసుపు,అల్లం పేస్ట్ వేయాలి.ఆ తరువాత ప్రక్కన బౌల్ లో పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి.చికెన్ ముక్కలు కొద్దిగా మగ్గాక సరిపడా నీళ్లను పోసుకొని ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.తర్వాత గరంమసాలా వేసుకుని ,కొత్తిమీరతో గార్లిక్ చేస్తే ఎంతో రుచికరమైన పెరుగు చికెన్ కర్రీ రెడీ….