7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4 శాతం పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ, డీఆర్ ను పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని 4 శాతం పెంచి 42 శాతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. జనవరి 1, 2023 నుంచే పెరగనున్న డీఏ, డీఆర్ అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. డీఏతో పాటు డీఆర్ కూడా పెరుగుతుందని తెలియడంతో పెన్షనర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్ మెంట్ అలవెన్స్ కోసం డీఏను అప్పటి ద్రవ్యోల్బణంను బట్టి పెంచుతూ ఉంటుంది. డీఆర్ కూడా అంతే. డీఆర్ పెన్షనర్ల కోసం పెంచుతుంటుంది. ప్రస్తుతం 38 శాతం డీఏను అందిస్తోంది. 4 శాతం పెరిగితే 42 శాతం కానుంది. అంటే.. బేసిక్ వేతనం రూ.18 వేలు అయితే.. డీఏ రూ.7560 కానుంది. 4 శాతం పెరిగితే రూ.720 కానుంది.
7th Pay Commission : 4 శాతం పెరిగినా భారీగా పెరగనున్న జీతాలు
4 శాతం డీఏ పెరిగితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ, డీఆర్ పెరుగుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 28న డీఏ పెరిగింది. దాన్ని జులై 1, 2022 నుంచి అమలు చేశారు. బకాయిలను కూడా ఇచ్చారు. 38 శాతానికి పెరిగింది. 12 నెలల యావరేజ్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం జూన్ 2022 వరకు లెక్కించి డీఏను 38 శాతానికి చేశారు. త్వరలో ఆ 38 శాతాన్ని 4 శాతం పెంచి.. 42 శాతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.