MLA Abbaya Chowdary : బస్సు రాలేదని చెప్పగానే.. స్పాట్‌లో ఎమ్మెల్యే వచ్చి 2 నిమిషాల్లో బస్సు వేయించాడు.. వీడియో
MLA Abbaya Chowdary : ప్రజాప్రతినిధులు అంటే ఎవరు.. ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. అందుకే కదా వాళ్లను ప్రజలు ఎన్నుకునేది. ప్రజల సమస్యలను తీర్చనప్పుడు ఎందుకు వాళ్లను ఎన్నుకోవడం వేస్ట్ కదా. కానీ.. అందరు ఎమ్మెల్యేలు అలా ఉండరు కదా. కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ప్రజలతో మమేకం అవుతారు. ప్రజలతోనే ఉంటారు. అలాంటి వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఏపీలో అలాంటి వాళ్లలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒకరు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా
చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేతిరెడ్డి ప్రతి రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో పర్యటించి అందరి సమస్యలు తీర్చుతారు. అలా.. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. వెంటనే వాళ్ల సమస్యలను తీర్చుతారు. ఇటీవల ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. ఏలూరు బస్టాండ్ కు వెళ్లారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో కాలేజీ పిల్లలు ఈరోజు బస్సు క్యాన్సిల్ చేశారు సార్.. బస్సు వేయలేదు. రోజూ ఇలాగే బస్సు క్యాన్సిల్ చేయడం వల్ల మాకు కాలేజీకి లేట్ అవుతోంది.
MLA Abbaya Chowdary : ఏలూరు బస్టాండ్ లో 2 నిమిషాల్లో స్టూడెంట్స్ కు బస్సు వేయించారు
కాలేజీ వాళ్లు ఫైన్ కట్టించుకుంటున్నారు. రెండు గంటల నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. దీంతో వెంటనే బస్సు సిబ్బందిని పిలిచి ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎందుకు బస్సు క్యాన్సిల్ అయిందని సీరియస్ అయ్యారు. 2 నిమిషాల్లో ద్వారకా తిరుమలకు బస్సు వేయించారు. అదే బస్సులో కూర్చొని విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.